బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (14:22 IST)

పెద్దపులి, ఎలుగుబంటి ఫైట్ వీడియో చూడండి

పెద్దపులి, ఎలుగుబంటిల మధ్య జరిగిన ఫైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలుగుబంటి... పెద్దపులి నువ్వా నేనా అన్న చందంలో పోటీపడ్డాయి. మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్కులో ఫిబ్రవరి 28వ తేదీన ఈ ఘట

పెద్దపులి, ఎలుగుబంటిల మధ్య జరిగిన ఫైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలుగుబంటి... పెద్దపులి నువ్వా నేనా అన్న చందంలో పోటీపడ్డాయి. మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్కులో ఫిబ్రవరి 28వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 
వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్కులో గత బుధవారం ఎండవేడిని తట్టుకోలేక రెండు ఎలుగుబంట్లు దగ్గర్లోని నీటి మడుగు వద్దకు వస్తుండగా... అదే సమయంలో వేటకోసం పెద్దపులి అక్కడికొచ్చింది. అయితే పెద్దపులిని చూసి ఎలుగుబంటి జడుసుకోలేదు. పులికి ఎదురు తిరిగింది. మీదపడిన పులిని ధీటుగా ఎదుర్కొంది. 
 
ఎలుగుబంటిని ఆహారంగా తీసుకోవాలని పెద్దపులి తీసుకున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ఎలుగుబంటి బారి నుంచి తప్పించుకున్న పెద్దపులి మెల్లగా అక్కడ నుంచి జారుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ లుక్కేయండి.