Widgets Magazine

రెండు పులులు చుట్టుముట్టాయి.. బైకుపై ఇద్దరు వ్యక్తులు ఏం చేశారో తెలుసా? (వీడియో)

గురువారం, 25 జనవరి 2018 (18:25 IST)

పులిని చూస్తే మీరేం చేస్తారు..? ఇంకా రెండు పులులు కనిపిస్తే.. భయంతో పరుగులు తీయరూ..? కానీ మహారాష్ట్రలో రెండు పులులు కనిపించినా.. బైకు మీద వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఏమాత్రం చలించకుండా వాటి బారి నుంచి బయటపడ్డారు.

ఒళ్లు గ‌గుర్పాటు క‌లిగించే ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర‌లోని ఓ అడ‌వి గుండా వెళ్తున్న దారిలో ఇద్దరు బైకు మీద వెళ్తున్నారు. అయితే బైక్ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు పులులు కనిపించాయి. భయంతో బండిని ఆపేశారు. అంతే బైకు మీద కూర్చున్న ఇద్ద‌రు వ్య‌క్తుల దగ్గరకు పులులు వచ్చాయి. వీడియో తీస్తున్న వారు క‌ద‌ల‌కుండా ఉండాల‌ని వారిస్తుండ‌టం, ఒక పులి కూర్చుని వుండగా.. మరో పులి మాత్రం వ్యక్తులకు వద్దకు వచ్చి అలా వెళ్ళింది. 
 
అదృష్ట‌వ‌శాత్తు పులులు ఆ వ్యక్తులు దాడి చేయలేదు. ఇక బైక్ మీద ఉన్న వ్య‌క్తులు కూడా వాటిని రెచ్చ‌గొట్టే ప‌నులేవి చేయ‌క‌పోవ‌డం క‌లిసి వ‌చ్చింది. ఇక ఈ తతంగాన్నంతా వీడియో తీస్తున్న కారు వాళ్ల ద‌గ్గ‌రికి వెళ్లింది. ఏమాత్రం కదలకుండా వుండమని కారులోని వారు సలహా ఇచ్చారు.

ఆపై వారి బైకు వద్దకు వెళ్లి వారిని లోప‌లికి ఎక్కించుకుని వేగంగా అక్క‌డి నుంచి బ‌య‌ట‌పడిన‌ట్లు స‌మాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. బైకుపై కూర్చున్న ఇద్దరు వ్యక్తులు పులుల బారి నుంచి తప్పించుకున్న వైనాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Tigers Motorcycle Video Bikers Maharashtra Miraculous Escape

Loading comments ...

తెలుగు వార్తలు

news

కత్తి మహేష్‌ తిరుపతి ఎంపీ సీటుకు పోటీ చేస్తారా? అదీ జనసేన పార్టీ ఇస్తుందా?

ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో తెలియదు కానీ భలేగా లాగించేస్తుంటారు. ఇటీవలి కాలంలో కత్తి ...

news

నాన్నా ఎందుకలా చేశారు? మోహన్ బాబుతో మంచులక్ష్మి...

నాన్నా.. ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూలో ఎందుకు అలా మాట్లాడారు. మీరు అలా మాట్లాడినందుకు మన మంచు ...

news

వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఘన విజయం: శైలజానాథ్ - ఫక్కున నవ్విన శ్రీవారి భక్తులు

తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ నేత శైలజానాథ్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల శైలజానాథ్ ...

news

మీరట్‌లో లైవ్ మర్డర్ (వీడియో)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా శాంతిభద్రతలు మాత్రం ఏమాత్రం అదుపులోకి ...

Widgets Magazine