Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కలబంద రసాన్ని రోజూ గ్లాసుడు తాగితే ఏమౌతుందంటే?(Video)

గురువారం, 25 జనవరి 2018 (14:49 IST)

Widgets Magazine

ముఖ చర్మంపై ఏర్పడిన మొటిమలకు చెక్ పెట్టాలంటే.. కలబంద రసాన్ని వాడి చూడండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ముఖంపై ఏర్పడిన మచ్చలు, మొటిమలు తగ్గాలంటే.. పొడిబారిన చర్మానికి మేలు చేకూర్చాలంటే.. కలబంద రసాన్ని రోజూ ముఖానికి రాసుకుంటూ వుండాలి. పురుషులు ముఖానికి షేవ్ చేసుకున్న తర్వాత కలబంద రసం రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
కలబంద రసాన్ని రాత్రిపూట ముఖానికి రాసుకుని ఉదయం గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేస్తే చర్మం ప్రకాశవంతం అవుతుంది. చర్మానికి తేమ చేకూరుతుంది. చర్మాన్ని యవ్వనంగా వుంచుతుంది. అలాగే కేశాల సంరక్షణకు కలబంద ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
ఇక చుండ్రును తొలగించుకోవాలంటే.. కలబంద గుజ్జును మాడుకు పట్టించి.. 20 నిమిషాల తర్వాత కడిగియాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తే చుండ్రు మాయమవుతుంది. కలబంద గుజ్జు, కొబ్బరినూనెను వేడి చేసి తలకు రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. ఇందులోని విటమిన్ సి, బి ధాతువులు చర్మానికి మేలు చేస్తాయి. ముఖంపై గల ముడతలను తగ్గిస్తాయి. చర్మంలోని కొలాజన్ అనే కొవ్వు శాతాన్ని తగ్గించే ప్రోటీన్లు కలబందలో పుష్కలంగా వున్నాయి. 
 
అలాగే కలబంద రసాన్ని రోజూ పరగడుపున తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కలబంద రసాన్ని రోజూ తీసుకుంటే శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడుతాయి. శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిస్తాయని.. తద్వారా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మగజాతి అంతమైపోతుందా? ఎందుకంటే...

మేం మగాళ్లమంటూ విర్రవీగే మగజాతికి ఇదో దుర్వార్త. త్వరలోనే మగజాతి అంతరించిపోయే దిశగా ...

news

పుల్లటి తేపులు వస్తున్నాయా? ఏలకులు తినండి..

ఆహారం తీసుకుంటే పుల్లటి తేపులు వస్తున్నాయా..? యాలకులు తినండి అంటున్నారు ఆయుర్వేద ...

news

స్మార్ట్‌ఫోన్లను అతిగా వాడుతున్నారా? ఐతే హ్యాపీ హుష్ కాకి

స్మార్ట్‌ఫోన్లను అతిగా వాడుతున్నారా? అయితే ఆనందం కోల్పోతున్నట్టే. స్మార్ట్‌ఫోన్ల వాడకంలో ...

news

అన్నం వండేటప్పుడు వంచే వేడివేడి గంజిని ఇలా తాగితే?

అన్నం వండేటప్పుడు వంచే వేడివేడి గంజిని ఉప్పేసుకుని కాసేపు ఆరిన తర్వాత తాగితే శ్వాస ...

Widgets Magazine