శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 23 జనవరి 2018 (15:29 IST)

అన్నం వండేటప్పుడు వంచే వేడివేడి గంజిని ఇలా తాగితే?

అన్నం వండేటప్పుడు వంచే వేడివేడి గంజిని ఉప్పేసుకుని కాసేపు ఆరిన తర్వాత తాగితే శ్వాస సమస్యలు తొలగిపోతాయి. రోజు గంజి తాగడం వల్ల శ్వాస కోస సంబంధ వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, గొంతుకి సంబంధించి వ్యాధులు

అన్నం వండేటప్పుడు వంచే వేడివేడి గంజిని ఉప్పేసుకుని కాసేపు ఆరిన తర్వాత తాగితే శ్వాస సమస్యలు తొలగిపోతాయి. రోజు గంజి తాగడం వల్ల శ్వాస కోస సంబంధ వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, గొంతుకి సంబంధించి వ్యాధులు మాయమవుతాయి. అన్నం ఉడికించే గంజిలో చిటికెడు ఉప్పు వేసుకొని త్రాగితే జీర్ణక్రియ, శ్వాసక్రియ మెరుగ్గా ఉంటుంది. నూకలు తెచ్చుకొని గంజి చేసుకొని తాగితే శ్వాస సంబంధిత రోగాలు దూరమవుతాయి. 
 
గంజికి ప్రస్తుతం దొరికే సన్నబియ్యం కంటే లావు బియ్యమే శ్రేష్ఠం. రోజు కనీసం ఒక గ్లాసు గంజి త్రాగండి. ఉదయం అశ్వగంధ లేహ్యం ఒక చెంచా... రాత్రి పడుకునే ముందు ''త్రిఫల చూర్ణం'' ఒక చెంచాడు తీసుకొని గ్లాస్ నీళ్ళలో కలుపుకొని త్రాగండి. ఇలా చేస్తే శ్వాస సమస్యలుండవు.
 
దుమ్ము, ధూళి, రసాయనాల ప్రభావం వల్ల దీర్ఘకాల సమస్యలు వస్తాయి. అందులో ఆస్తమా ఒకటి. ఆస్తమాను దూరం చేసుకోవాలంటే మాస్క్‌లు వాడాలి. బయటికి వెళ్లినప్పుడు ముక్కుకు మాస్క్‌లు ధరించడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.