శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (09:35 IST)

చరిత్రలో ఈరోజు

సంఘటనలు:
1968: జాతుల వివక్షత కారణంగా, కీవ్‌ లాండ్ లో జరిగిన అల్లరలో, ముగ్గురు పోలీసులతో సహా 11 మంది మరణించారు.
1972: మొట్టమొదటి 'ఎర్త్ రిసోర్సెస్ టెక్నాలజీ సాటిలైట్ (ఇ.ఆర్.టి.ఎస్) ను ప్రయోగించారు.
1973: సెయింట్ లూయిస్ దగ్గర, పిడుగు పడి, ఓజార్క్ ఎ.ఎల్. విమానంలోని 36 మంది మరణించారు.
1974: గ్రీకు మిలిటరీ నియంతృత్వం పడిపోయింది.
1979: '#2736 ఆప్స్' అనే గ్రహశకలాన్ని 'ఇ. బొవెల్' కనుగొన్నాడు.
1980: 'సోయుజ్ 37' అనే రోదసీ నౌక, ఇద్దరు రోదసీ యాత్రికులను (ఒకడు వియత్నాంకి చెందిన వాడు), రోదసీలో అప్పటికే ఉన్న 'సాల్యూత్ 6' రోదసీనౌకకు చేరవేసింది.
1984: 'కుంబ్రియా' లో ఉన్న 'సెల్లాఫీల్డ్' దగ్గర ఉన్న వివాదాస్పదమైన అణు కర్మాగారం దగ్గర నివసిస్తున ప్రజలలో ఎక్కువగా కనిపిస్తున్న కేన్సర్ (ల్యూకేమియా) కి, అక్కడి అణుకర్మాగారానికి సంబంధం లేదని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. మరింత పరిశోధన కూడా జరగాలని చెప్పింది.
1987: తూర్పు జర్మనీకి చెందిన 'పెత్రా ఫెల్కె' 78.89 మీటర్ల దూరం 'జావెలిన్' విసిరింది (మహిళల రికార్డు).
1987: మొరాకోకి చెందిన 'సయిద్ ఆఔత' 5000 మీటర్ల దూరం 12 నిమిషాల 58.39 (12:58.39) సెకన్లలో పరుగు పెట్టి రికార్డు స్థాపించాడు.
 
జననాలు:
1936: శివ్ కుమార్ బటాల్వి, పంజాబీ భాషా కవి. (మ.1973)
1856: బాలగంగాధర తిలక్, భారత జాతీయనేత. (మ.1920)
1870: రాయసం వెంకట శివుడు, రచయిత, పత్రికా సంపాదకులు, సంఘసంస్కర్త. (మ.1954)
1892: హేలి సెలాస్సీ, ఇతియోపియా (1930-1974) చక్రవర్తి (మ. 1975).
1893: కార్ల్ మెన్నింజెర్, మానసిక శాస్త్రవేత్త (మెన్నింజెర్ క్లినిక్) (మ.1990).
1906: చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (మ.1931)
1946: పులి వీరన్న, రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందినాడు.
1953: గ్రాహం గూచ్, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1986: గొట్టిముక్కుల రమాకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ అధ్యక్షులు, వరంగల్ అర్బన్ జిల్లా, తెలంగాణ.
 
మరణాలు:
1885: యులీసెస్ ఎస్. గ్రాంట్, 18వ అమెరికన్ ప్రెసిడెంట్, తన 63వ ఏట మౌంట్ మెక్‌గ్రెగర్, (న్యూయార్క్) లో చనిపోయాడు.
1916: విలియం రామ్సే, స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (జ.1852)
2004: మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు. (జ.1932)
2020: ఎం.డి.నఫీజుద్దీన్, తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (జ.1940)
 
పండుగలు, జాతీయ దినాలు
1952: ఈజిప్ట్ జాతీయదినోత్సవం
ఇథియోపియా జాతీయదినోత్సవం