శ్రీకృష్ణుడికి 16 వేల మంది గోపికలు.. ఈ విశ్వనాథుడికి ఐదుగురు భార్యలు.. ఎక్కడ?

శ్రీకృష్ణుడికి 16 వేల మంది గోపికలు ఉండేవారనీ మన పురాణాలు చెబుతున్నాయి. ఆయన్ను ఆదర్శంగా తీసుకున్నాడు ఓ ఎస్.ఐ. ఆయన పేరు విశ్వనాథ్. ఈయన ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. తాను పని చేసిన చోటల

pnr| Last Updated: మంగళవారం, 7 ఆగస్టు 2018 (13:58 IST)
శ్రీకృష్ణుడికి 16 వేల మంది గోపికలు ఉండేవారనీ మన పురాణాలు చెబుతున్నాయి. ఆయన్ను ఆదర్శంగా తీసుకున్నాడు ఓ ఎస్.ఐ. ఆయన పేరు విశ్వనాథ్. ఈయన ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. తాను పని చేసిన చోటల్లా ఓ పెళ్లి చేసుకున్నాడు. చివరకు గుండెపోటుతో మరణించాడు. ఆయన ఆస్తికోసం భార్యలు స్టేషన్‌ను ఆశ్రయించడంతో విశ్వనాథంగారి బండారం బయటపడింది.
 
బెంగళూరు: కృష్ణుడికి 16వేల మంది ప్రియురాళ్లు ఉండేవారని ప్రతీతి. ఆయనను ఆదర్శంగా పెట్టుకున్నాడు ఓ రిటైర్డు ఎస్‌ఐ. తుమకూరు జిల్లాలో ఆ రిటైర్డు ఎస్‌ఐ ఆస్తి కోసం ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు మహిళలు తామందరూ ఆయన భార్యలమంటూ... పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించడంతో అధికారులు ఖంగుతిన్నారు. 
 
కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు తాలూకా స్వాందేనహళ్ళికి చెందిన ఎస్‌ఐ విశ్వనాథ్‌ ఏకంగా ఐదుగురుని వివాహం చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో సంసారం సాగించాడు. జూలై 18న ఆయన గుండెపోటుతో మృతి చెందడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. మరణ సమయంలో ఆయన మూడో భార్య చేతన మాత్రమే ఆయన వద్ద ఉన్నారు. విశ్వనాథ్‌ మొదటి, రెండో భార్య పిల్లలు కూడా అంత్యక్రియలలో పాల్గొన్నారు. అప్పటికి కర్మకాండ ముగించినా ఆస్తి కోసం విభేదాలు రావడంతో వారంతా పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు.
 
మొదటి భార్య సరోజమ్మ, రెండో భార్య శారదతోపాటు మూడో భార్య చేతనలేకాకుండా గుట్టుచప్పుడుకాకుండా మరో ఇరువురిని కూడా విశ్వనాథ్‌ వివాహమాడినట్లు తేలింది. అయితే ఇరువురు భార్యలు ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా వదిలేసినట్లు తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు తుమకూరు గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 58 ఏళ్ళ వయసులోనూ విశ్వనాథ్‌ 22ఏళ్ళ చేతనను పెళ్ళాడడం ప్రత్యేకం. పనిచేసిన ప్రతిచోటా ఒక సంసారమే నడిపి తనలోని రసికతను ప్రదర్శించాడు. దీనిపై మరింత చదవండి :