జమ్మూకాశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్
జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా చౌగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఉగ్రవాదుల ఉనికి గురించిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దీనితో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. భద్రతా దళాలు వారిపై కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు.
ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశానికి భద్రతా బలగాలు కార్నర్ చేశారు. ఐతే ఇంకా ఎంతమంది వున్నారన్నది సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.