శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (15:43 IST)

నవీ ముంబైలో పారాచూట్ సాయంతో ల్యాండైన టెర్రరిస్టులు?

నవీ ముంబైలోని ఘన్‌సోలీ ప్రాంతం సమీపంలోని బీచ్‌లో పారాచూట్ సహాయంతో గుర్తుతెలియని విదేశీ దంపతులు ఇద్దరు ల్యాండ్ అయిన వార్త సంచలనం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం 25 ఏళ్ల విదేశీ మహిళ నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల బిల్డింగ్‌పై పారాచూట్‌తో దిగింది. అంతకంటే ముందే ఆమె బాయ్ ఫ్రెండ్ భూమిపై దిగి ఆమెకు హాయ్ చెప్పాడని వారు చెప్పారు. 
 
దాంతో ముంబై పోలీసులతోపాటు యాంటీ టెర్రర్ సెల్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. పారాచూట్ సహాయంతో ఇద్దరు వ్యక్తులు దిగుతున్నట్లు సీసీటీవీ ఫూటేజ్‌లు లభించినా వారు విదేశీయులని రుజువుకాలేదు. గతంలో టెర్రరిస్టులు ముంబైలోకి ప్రవేశించి దాడులకు పాల్పడిన నేపథ్యంలో, గుర్తుతెలియని వ్యక్తులు పారాచూట్‌ల సహాయంతో నవీ ముంబైలోకి వచ్చిన కారణంగా పోలీసులు తీరప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన భద్రతా బలగాలు స్థానికులు చెప్పిన మాటలను ప్రక్కనబెట్టి, అది గాలి వార్త అని కొట్టిపడేశారు.