శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (13:49 IST)

యోగి హెలికాప్టర్ పశ్చిమ బెంగాల్‌లో దిగేందుకు వీల్లేదు.. సీఎం మమత

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఆ రాష్ట్ర సీఎం మమత చుక్కలు చూపించారు. యూపీ సీఎం బీజేపీ సభలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ వచ్చేందుకు హెలికాప్టర్లో ప్రయాణమయ్యారు.


కానీ ఆయన హెలికాప్టర్ పశ్చిమ బెంగాల్‌లో ల్యాండ్ అయ్యేందుకు మమత సర్కారు అనుమతులు ఇవ్వలేదు. దీంతో బీజేపీ పశ్చిమ బెంగాల్ సీం మమత బెనర్జీపై గుర్రుగా వుంది. అధికార పక్షానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని మహా కూటమిలో మమత బెనర్జీ కూడా వున్నారు. 
 
ఇంకా దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అయినా బీజేపీ తన పార్టీ సత్తాను చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఎన్నికల కోసం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ బలాన్ని నిరూపించేందుకు 200 స్థానాల్లో సభలు నిర్వహించేందుకు బీజేపీ సర్కారు ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా ఆదివారం ధీనజ్ పూర్‌లో బీజేపీ బహిరంగ సభ జరగాల్సి వుండగా.. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రావాల్సి వుంది. 
 
కానీ హెలికాప్టర్‌లోని లోపాలను సాకుగా చూపెట్టి.. యోగి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు అనుమతులు ఇవ్వలేమని మమతా బెనర్జీ సర్కారు అనుమతులను నిరాకరించింది. దీంతో యోగి బహిరంగ సభలో ఫోన్ ద్వారా ప్రసంగించారు. యోగి హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వకపోవడంపై ఆ రాష్ట్ర బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. దీనిపై ప్రధాని మోదీ కూడా మమత సర్కారు తీరును  ఖండించారు.