కోడలిని ట్రాప్ చేసి ముగ్గులో దింపిన మామ, బెడ్ పైన అసభ్యకర రీతిలో చూసిన భర్త

murder
జె| Last Modified సోమవారం, 27 జులై 2020 (22:23 IST)
కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు వావివరసలు మర్చిపోయి సంబంధాలు పెట్టేసుకుంటున్నారు. తండ్రితో సమానంగా భావించాల్సిన మామతో ఒక కోడలు అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి హెచ్చరించినా పట్టించుకోలేదు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా పెన్నగరం పరిధిలోని ఎంకే నగర్‌కి చెందిన మునియప్పన్‌కి ఆరుగురు కొడుకులు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మునియప్పన్ భార్య కొంతకాలం క్రితమే చనిపోయింది. దీంతో ఒంటరిగా ఉంటున్నాడు. తాను నివాసముంటున్న ప్రాంతానికి దగ్గరలోనే నాలుగో కుమారుడు ఉంటున్నాడు.

ఎవరూ అందుబాటులో లేకపోవడం.. నాలుగో కుమారుడు మాత్రమే పక్కనే ఉండటంతో అప్పుడప్పుడు భోజనం తినేందుకు వారికి ఇంటికి వెళ్ళేవాడు. కూతురితో సమానంగా భావించాల్సిన కోడలిపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. లోబరుచుకున్నాడు. ఈ తంతు గత రెండునెలల నుంచి సాగుతోంది.

మునియప్పన్ కొడుకుకి స్థానికుల ద్వారా ఆ విషయం తెలిసింది. భార్యను హెచ్చరించాడు. తండ్రిని పద్ధతి మార్చుకోమన్నాడు. అయినా వారు మారలేదు. మద్యం మత్తులో నిన్న రాత్రి ఇంటికి వెళ్ళాడు. భోజనం తినేందుకు వెళ్ళిన మునియప్పన్ కోడలితో రాసలీలల్లో ఉన్నాడు.

దీంతో తట్టుకోలేని కొడుకు ఇంట్లో ఉన్న కత్తితో తండ్రిని నరికేశాడు. భార్యపై దాడి చేసే లోపే ఆమె భయపడి పారిపోయింది. నిందితుడు నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. ఈ హత్య కాస్త స్థానికంగా తీవ్ర సంచలనంగా మారుతోంది.దీనిపై మరింత చదవండి :