Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తొందరెందుకు... ఏపీని ప్రత్యేక రాష్ట్రంగానే చూస్తున్నాం కదా : నరేంద్ర మోడీ

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (13:11 IST)

Widgets Magazine
chandrababu-Modi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా రాష్ట్రంగానే చూస్తున్నామనీ, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామంటూ తనను కలిసిన టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 
 
ఇటీవల పార్లమెంట్‌లో దాఖలు చేసిన వార్షిక బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం చేశారంటూ అధికార టీడీపీతో పాటు ఏపీ ప్రజలు అక్రోషిస్తున్న విషయం తెల్సిందే. దీంతో పార్లమెంట్ వేదికగా చేసుకుని టీడీపీ ఎంపీలు నిరసన, ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 
 
అదేసమయంలో టీడీపీ తరపున కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి కూడా ప్రధాని మోడీతో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలతో పాటు ప్రజల మనోభావాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 
 
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ఏపీని ప్రత్యేక రాష్ట్రంగానే చూస్తున్నామనీ, ఏపీకి ఇచ్చిన అన్ని వాగ్ధానాల నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. ఏదైనా సమస్య పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని అందువల్ల అన్ని విషయాలపై చర్చించుకుని పరిష్కరించుకుందామన్నారు. ఈ విషయాన్ని తన మాటగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పాలనీ, అవసరమైతే తానే బాబుతో మాట్లాడుతానని మంత్రి సుజనా చౌదరితో చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
సుజనా చౌదరి నరేంద్ర మోడీ పార్లమెంట్ Budget 2018 Meets Pm Modi Sujana Chowdary Tdp Agitation తెలుగుదేశం పార్టీ

Loading comments ...

తెలుగు వార్తలు

news

మోదీ సర్కారును చంద్రబాబు గద్దె దించాలి: ఉండవల్లి సలహా

కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పది మంది ఎంపీలు ...

news

మాల్దీవుల్లో ఎమర్జెన్సీ : సుప్రీం న్యాయమూర్తుల అరెస్టు

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆ దేశ సుప్రీంకోర్టుకు చెందిన న్యాయమూర్తులు ...

news

భర్త నుంచి కాపాడాలంటూ భార్య అరణ్య రోదన (వీడియో)

ముంబైకు చెందిన ఓ మహిళ తన భర్త నుంచి కాపాడాలంటూ ట్విట్టర్‌లో వీడియో ద్వారా పోలీసులకు ...

news

భువనగిరిలో హాట్ కాలింగ్ : బూతు మాటలు మాట్లాడటమే ఉద్యోగం

తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరిలో హాట్ కాలింగ్ గుట్టురట్టయింది. ఉద్యోగం పేరుతో అందమైన ...

Widgets Magazine