అయోధ్యలో దీపావళికి దీపోత్సవం.. ప్రత్యేక పోర్టల్ ప్రారంభం
రామ జన్మభూమి అయోధ్యలో దీపావళి సందర్భంగా 'దీపోత్సవం' నిర్వహిస్తుంటారు. ఈసారి శ్రీరామలీల దర్బార్‌లో నిర్వహించే దీపోత్సవంలో రామ భక్తులు వర్చువల్ విధానంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం యోగి ఆదిత్యనాథ్ సర్కారు ప్రత్యేక పోర్టల్ రూపొందించింది. దీనిలో భక్తులు వర్చువల్ విధానంలో దీపాలను వెలిగించవచ్చు.
పైగా భక్తులు దీపాలను వెలిగించినప్పుడు అవి నిజమైన దీపాలనే అనే అనుభూతి కలిగించేలా ఈ పోర్టల్‌లో ఏర్పాట్లు చేశారు. ఈ పోర్టల్‌లో ముందుగా శ్రీరాముని ముఖచిత్రం కనిపిస్తుంది. దాని ముందు వర్చువల్ దీప ప్రజ్వలన జరుగుతుంటుంది. దీని ముందు భక్తులు దీపం వెలిగించవచ్చు. ఈ వెబ్‌సైట్‌ను నవంబరు 13న యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారు.