మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (12:49 IST)

భార్య చేతులు కట్టేసి సైకిల్ ట్యూబు, టైరుతో చావబాదిన భర్త (వీడియో)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటికీ.. ఆ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు ఘోరాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని చెప్పొచ్చు. తాజాగా ఈ రాష్ట్రంలోని బులంద్‌ షహర్‌ జిల్లాలో ఒక మహిళకు ఆ గ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటికీ.. ఆ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు ఘోరాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని చెప్పొచ్చు. తాజాగా ఈ రాష్ట్రంలోని బులంద్‌ షహర్‌ జిల్లాలో ఒక మహిళకు ఆ గ్రామ పంచాయతీ అత్యంత పాశవికమైన శిక్షను విధించింది. పైగా, ఈ శిక్షను కట్టుకున్నవాడే అమలు చేయాలంటూ నిబంధన విధించింది. దీంతో ఆ భర్త శిక్షను అమలు చేయగా, దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, దేశ రాజధాని ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో బులంద్ షహర్ జిల్లాకు చెందిన గ్రామంలోని మహిళ వివాహేతర సంబంధం కలిగి ఉందని ఆరోపిస్తూ, ఆమె భర్త పంచాయతీ పెట్టించాడు. దీంతో పంచాయతీ ఆమెను కట్టేసి కొట్టాలని శిక్ష విధించింది. దీంతో ఆమె భర్త పంచాయతీకి వచ్చిన ఊరి ప్రజలందరి ముదు అక్కడే ఉన్న చెట్టుకు ఆమె చేతులు కట్టేసి, సైకిల్ ట్యూబు, టైరుతో కొట్టాడు. దెబ్బలు తాళలేక ఆమె స్పృహ కోల్పోయింది. 
 
దానిని చూసిన వారంతా నవ్వుతూ వీడియోలు తీసుకున్నారే కానీ, అది తప్పు అని ఒక్కరు కూడా చెప్పకపోవడం విశేషం. దీనిని సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసుల, ఆమె భర్త, గ్రామ ప్రధాన్‌ను అరెస్టు చేశారు. దీనికి కారణమైన మరో 25 మందిపై కేసులు నమోదు చేశారు.