Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉప రాష్ట్రపతి షూలనే కొట్టేసిన దొంగలు... డొల్ల సెక్యూరిటీ అంటూ...

శుక్రవారం, 19 జనవరి 2018 (19:18 IST)

Widgets Magazine
venkaiah

నిజంగా.. నవ్వు కోవాల్సిన సంఘటన ఇది. దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తికి ఎప్పుడూ జెడ్ కేటగిరి భద్రత ఉంటుంది. ఆయన ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతంలో ఎప్పుడూ సెక్యూరిటీ తిరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా వెంకయ్యనాయుడు చుట్టూ ఉన్న వ్యక్తులందరూ సేఫ్ జోన్‌లోనే ఉంటారని అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం అంతా విరుద్ధం. ఏకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు షూలను ఎవరో దొంగిలించుకుని వెళ్ళిపోయారు. షూలనే కాపాడలేని సెక్యూరిటీ సిబ్బంది ప్రముఖులను ఏం కాపాడతారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
 
బెంగుళూరులోని ఎంపి మోహన్ ఇంట్లో ఒక కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హాజరయ్యారు. ఇంట్లోకి వెళ్ళే సమయంలో వెంకయ్యనాయుడు తన షూను ఇంటి బయట వదిలి వెళ్ళారు. ఆ తరువాత బయటకు వచ్చి చూసేసరికి షూలు కనిపించలేదు. దీంతో కొద్దిసేపు అలాఇలా తిరిగారు వెంకయ్య. ఉపరాష్ట్రపతితో పాటు ఆయన సెక్యూరిటీ, సన్నిహితులు కూడా షూలను వెతికారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కొత్త షూలను సెక్యూరిటీ సిబ్బంది కొనుక్కుని వచ్చి ఇచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటంపై ఉపరాష్ట్రపతి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మా అబ్బాయి కత్తి మహేష్‌కు తిక్కుంది... ఐతే దానికో లెక్కుంది.... ఆఁ... ఆఆఁ

కత్తి మహేష్. ఈ పేరు వింటేనే పవన్ కళ్యాణ్‌ అభిమానులు ఒంటి కాలిపై లేచి నిలబడతారు. అభిమానులు ...

news

తెరాస గూటికి మోత్కుపల్లి నర్సింహులు...?

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన ...

news

అమృత జయలలిత కుమార్తెనా కాదా?: ఫిబ్రవరి 1న కోర్టులో విచారణ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ అమృత తెరపైకి వచ్చింది. గతంలో తాను జయలలిత ...

news

ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ప్రమాణ స్వీకారం

అమరావతి : కర్నూలు స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేఈ ప్రభాకర్ ...

Widgets Magazine