బీజేపీ పాలనలో బీజేపీ అభ్యర్థికి చెప్పుల దండతో సత్కారం (వీడియో)

సోమవారం, 8 జనవరి 2018 (10:36 IST)

chappal garner

భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆ పార్టీ అభ్యర్థికి స్థానిక ఓటర్లు తగిన రీతిలో గుణపాఠం నేర్పారు. ఇచ్చిన హామీని నెరవేర్చనందుకు ప్రతిగా మెడలో చెప్పుల దండ వేసి సత్కారం చేశారు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ సర్కారు అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఉన్నారు. ఈ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం కోసం దినేశ్ శర్మ అనే అభ్యర్థి మధ్యథామ్ నోడ్ అనే ప్రాంతానికి ప్రచారానికి వెళ్లాడు. 
 
ఇంటింటి ప్రచారానికి వెళ్లి ఓట్లు అడుగుతుంటే, ఓ వ్యక్తి వచ్చి చెప్పుల దండను ఆయన మెడలో వేశాడు. దీంతో హుషారుగా ప్రచారం నిర్వహిస్తున్న ఆయన షాక్‌కు గురై, ఆ వెంటనే తేరుకున్నాడు. తొలుత చెప్పులను పక్కకు పడేసేందుకు ప్రయత్నించిన శర్మ, ఆ వ్యక్తి తన ప్రయత్నాన్ని మానకపోవడంతో దండ వేయించుకోవాల్సి వచ్చింది. 
 
తమ ప్రాంతంలోని తాగునీటి సమస్య అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం కలగలేదని, అందుకే ఈ పని చేశానని చెప్పుల దండను తెచ్చిన వ్యక్తి వ్యాఖ్యానించాడు.
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రియుడే ముద్దంటున్న భార్యలు... వణుకుతున్న భర్తలు

ఓ స్వాతి, ఓ భారతి, ఓ శ్రీవిద్య, ఓ జ్యోతి.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను ...

news

చైనాలో ఘోర ప్రమాదం: నౌకలు ఢీ... 32మంది గల్లంతు.. జలాలు కలుషితం

చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చైనా సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్న ఘటనలో 32 మంది ...

news

భార్యాభర్తల మధ్య వివాదం... పిండానికి డీఎన్ఏ పరీక్ష

తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రిని కాదంటూ ఓ భర్త చేసిన ఆరోపణలతో ఆ వివాహిత ...

news

కార్గిల్‌లో మైనస్ 18.8 డిగ్రీలు... హర్యానాలో చలిదెబ్బకు సెలవులు

భూతలస్వర్గంగా భావించే కాశ్మీర్‌లో తొలిసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ...