గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (09:42 IST)

భార్యాభర్తల మధ్య వివాదం... పిండానికి డీఎన్ఏ పరీక్ష

తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రిని కాదంటూ ఓ భర్త చేసిన ఆరోపణలతో ఆ వివాహిత కుంగిపోయింది. ఇంతలోనే ఆమెకు అబార్షన్ అయింది. ఆ తర్వాత ఆ పిండానికి డీఎన్ఏ పరీక్ష చేసి.. తన కడుపులో పెరిగిన బిడ్

తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రిని కాదంటూ ఓ భర్త చేసిన ఆరోపణలతో ఆ వివాహిత కుంగిపోయింది. ఇంతలోనే ఆమెకు అబార్షన్ అయింది. ఆ తర్వాత ఆ పిండానికి డీఎన్ఏ పరీక్ష చేసి.. తన కడుపులో పెరిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ ఆమె పట్టుబట్టింది. దీంతో పోలీసులు పిండానికి డీఎన్ఏ టెస్ట్ చేసి తండ్రి ఎవరో తేల్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శియోనీ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
శియోనీ జిల్లాలోని ఖవాస గ్రామానికి చెందిన పంకజ్ శివాహరే అనే యువకుడు జబల్‌పూర్ పట్టణానికి చెందిన రీటాను వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులకే ఆమె గర్భందాల్చింది. దీంతో రీటా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రిని కాదని వేరే వారి బిడ్డని భర్త పంకజ్ భార్యను పుట్టింట్లో వదిలివేశాడు. దీంతో పంకజ్, రీటా కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. 
 
ఈ క్రమంలో రీటాకు అబార్షన్ అయింది. అబార్షన్ చేయించుకున్న అనంతరం రీటా తన పిండాన్ని తీసుకొని కుర్రాయి పోలీసుస్టేషనుకు వచ్చి తన కడుపులో నుంచి అబార్షన్ చేయించి తీసిన పిండానికి తండ్రి ఎవరో డీఎన్ఏ పరీక్ష చేయించి తేల్చాలని కోరింది. రీటా కడుపులో పెరిగిన పిండంపై భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదంతో పోలీసులు రీటా పిండానికి డీఎన్ఏ పరీక్ష చేయించి భర్తకు భార్యపై ఏర్పడిన అనుమానాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు అదనపు ఎస్పీ గోపాల్ ఖండేల్ చెప్పారు. మొత్తంమీద ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది.