Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జమ్మూకాశ్మీర్‌లో వివాహం.. డేట్ ఫిక్స్ 18న పెళ్లికూతురు కానున్న ఆమ్రపాలి

ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (11:29 IST)

Widgets Magazine
Amrapali

ఐపీఎస్ అధికారి, పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ కల్నల్ ఆర్కే శర్మ కుమారుడు సమీర్‌ను జమ్మూకాశ్మీర్‌లో కలెక్టర్ ఆమ్రపాలి వివాహం చేసుకోనున్నారు. ఈ నెల 18న ఈ జంట వివాహం జరుగనుండగా, 23న వరంగల్‌లో 25న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 
 
హైదరాబాద్‌లో జరిగే విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మంత్రులు, అధికారులు, సెలబ్రిటీలు మొత్తం 500 మందికి ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది. ఆపై 26వ తేదీన వెళ్లనున్న ఆమ్రపాలి.. సమీర్ జంట మార్చి 7వరకూ అక్కడే గడపనుంది. ఇకపోతే.. త్వరలోనే ఆమ్రపాలి పెళ్లి కుమార్తె కానున్నారు. ఆమ్రపాలి వివాహంపై సోషల్ మీడియాలో గత కొన్ని వారాలుగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

ఈ వివాహం జమ్మూ కాశ్మీర్‌లో జరగనుండగా, ఆపై 23న వరంగల్‌లో, 25న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటైంది. విందుకు ఆహ్వానం పలుకుతూ, పత్రికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. కానీ పెళ్లి పత్రికలో అచ్చు తప్పు దొర్లింది. 

23న జరిగే విందు ఆహ్వాన పత్రికలో శుక్రవారం బదులు ఆదివారం అని అచ్చు తప్పు పడింది. దీన్ని శుక్రవారంగా సరిచేస్తూ స్టిక్కర్ వేసి ఆహ్వానాలను అందిస్తున్నారు. హనుమకొండలోని సుబేదారి ప్రాంతంలో ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 23న సాయంత్రం 6 గంటల నుంచి రిసెప్షన్ సాగనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ఆమ్రపాలి ఐపీఎస్ సమీర్ వివాహం Warangal Amrapali Marriage Young Collector

Loading comments ...

తెలుగు వార్తలు

news

హైదరాబాద్‌లో తప్పతాగి నానాయాగీ చేసిన యువతి..

హైదరాబాదులో మందుబాబులు రెచ్చిపోతున్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసులు హైదరాబాద్‌లో ...

news

వాణీ విశ్వనాథ్‌కి బిస్కెట్ - రోజాకు జిలేబీ... ఏంటిది..?

ముందస్తు ఎన్నికలు రాకుండానే వైసిపి ఎమ్మెల్యే రోజాకు కష్టాలు వచ్చిపడ్డాయి. అదేంటి.. ...

news

ప్రాణాలు తీసిన హల్వా... ఏం జరిగింది?

రాజస్థాన్‌లో‌ ఘోరం జరిగింది. బంధువుల ఇంటికెళ్లి హల్వా తిని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ...

news

అబ్బే... పవన్ కళ్యాణ్ దానికి సరిపోడు... ముద్రగడ సంచలన వ్యాఖ్యలు(Video)

కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ...

Widgets Magazine