బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (18:27 IST)

అద్వానీని పట్టించుకోని మోదీ.. నమస్కారం పెట్టినా సంస్కారం లేకుండా?

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించనప్పటి నుంచి బీజేపీ మీడియా సీనియర్ నేతను విస్మరించిందని కోడైకూస్తోంది. ఆ వార్తల్లో నిజం లేదన్నట్లు ప్రధాని మోదీ వ్యవహరించినా

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించనప్పటి నుంచి బీజేపీ మీడియా సీనియర్ నేతను విస్మరించిందని కోడైకూస్తోంది. ఆ వార్తల్లో నిజం లేదన్నట్లు ప్రధాని మోదీ వ్యవహరించినా.. తాజాగా నరేంద్ర మోదీ మీడియాకు చిక్కారు. త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 
 
ఇందులో భాగంగా అగర్తలాలోని అసోం రైఫిల్స్ మైదానంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టించుకోలేదు. ఈ తతంగాన్ని మీడియా హైలైట్ చేసింది. సీనియర్ నేతను మోదీ అవమానించారని పేర్కొంది.  
 
మోదీ వేదికపైకి వస్తోన్న సమయంలో తమ పార్టీ నేతలందరికీ నమస్కరించిన నరేంద్ర మోదీ అద్వానీని మాత్రం పట్టించుకోలేదు. రెండు చేతులతో అద్వానీ నమస్కారం చేస్తున్నప్పటికీ మోదీ ప్రతి నమస్కారం చేయకుండా వెళ్లిపోయారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వేదికను అలంకరించిన నాయకులందరినీ ఆప్యాయంగా పలకరించిన మోదీ అద్వానీకి నమస్కారం కూడా చేయకపోవడం ఏమిటని.. నెటిజన్లు మండిపడుతున్నారు. సీనియర్ నేత చేతులెత్తి నమస్కరించి ప్రధాని ముందు భవ్యంగా నిలబడితే ప్రతి నమస్కారం చేయకుండా మోదీ మిగిలిన వారిని పలకరించడంపై బీజేపీ కార్యకర్తలు కూడా మండిపడుతున్నారు.