Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీజేపీతో ఒరిగిందేమీ లేదు.. ఓట్లు అదనంగా పడలేదు: చంద్రబాబు

శుక్రవారం, 9 మార్చి 2018 (12:51 IST)

Widgets Magazine
babu

రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే బీజేపీతో స్నేహాన్ని కొనసాగించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే బీజేపీ స్నేహం వల్ల ఒరిగిందేమీ లేదని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 సాధారణ ఎన్నికలకన్నా ముందే జరిగిన స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 
 
బీజేపీతో పొత్తు లేకుండా బరిలోకి దిగిన సమయంలో ఎన్ని ఓట్లు పడ్డాయో.. అదే ఓట్లే పొత్తుకు తర్వాత కూడా వచ్చాయని.. బీజేపీ వల్ల అదనంగా ఎలాంటి ఓట్లు రాలేదని మంత్రులు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయినప్పటికీ రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో  ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు.
 
హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామంటేనే కేంద్ర ప్రతిపాదనలకు అంగీకరించామని చంద్రబాబు మరోసారి గుర్తు చేశారు. ఈఏపీ ద్వారా నిధులు ఇస్తామని ఏడాదిన్నర క్రితం కేంద్రం హామీ ఇచ్చిందని.. కానీ ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని నిప్పులు చెరిగారు. యూసీలు కావాలని కేంద్రం అడిగిన ప్రతిసారీ, ఎప్పటికప్పుడు స్పందించి పంపుతూనే ఉన్నామని తెలిపారు. రాష్ట్రానికి సాయం చేసి ఆదుకోవాల్సింది పోయి.. బీజేపీ ఎదురుదాడికి దిగుతుందని చంద్రబాబు మండిపడ్డారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆ కారణాలతో బాధపడేవారు లోకం విడిచి వెళ్లొచ్చు : సుప్రీంకోర్టు

కారుణ్య మరణాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక రూలింగ్ ఇచ్చింది. ఎప్పటికీ నయం కాని ...

news

అసాధారణ పరిణామం : ఒక్కటికానున్న కిమ్ జాంగ్ ఉన్ - డోనాల్డ్ ట్రంప్

ప్రపంచంలో ఓ అసాధారణ పరిణామం ఆవిష్కృతం కానుంది. రెండు భిన్న ధృవాలు ఏకం కానున్నాయి. అంటే ...

news

నాయుడూజీ ఎలా ఉన్నారంటూ ఆరంభం - అన్నీ సవ్యంగానే జరుగుతాయంటూ ముగింపు : బాబుకు మోడీ ఫోన్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. కేంద్ర ...

news

కిమ్ జాంగ్‌తో డొనాల్డ్ ట్రంప్ చర్చలు.. స్టెఫానీతో సంబంధం లేదన్న..?

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సై ...

Widgets Magazine