శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 2 మే 2020 (22:55 IST)

ప్రియుడు పిలిస్తే రాలేదని ఆత్మహత్యకు పాల్పడిన ప్రియురాలు

క్షణికావేశం ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంటోంది. ఏమాత్రం ఆలోచించకుండా నిండు ప్రాణాలను తీసేసుకుంటున్నారు చాలామంది. తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రియుడు పుట్టినరోజును ఎంతో ఆర్భాటంగా జరుపుకుందామని ప్రియురాలు అనుకుంది. కానీ ప్రియుడు రాకపోవడంతో మనస్థాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
తమిళనాడు రాష్ట్రం విల్లుపురానికి చెందిన శివ కుమార్తె శరణ్య రైల్వే కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన సాయుధ బలగంలో పనిచేసే ఏలుమలైతో శరణ్యకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. నిన్న ఏలుమలై పుట్టినరోజు. తన ప్రియుడు పుట్టినరోజును తన ఇంటిలో జరుపుకోవాలనుకుంది.
 
కోవిడ్.. 19 విధుల్లో ఉన్న శరణ్య ఇంటికి వెళ్ళి ప్రియుడు కోసం కేక్ రెడీ చేసింది. ఇల్లు మొత్తం బెలూన్లతో అలంకరించింది. అయితే ఆహారం కేటాయించే విషయానికి సంబంధించి భద్రతగా ఏలుమలైను నియమించారు. దీంతో రాత్రి 9 గంటల వరకు రాలేకపోయాడు ఏలుమలై. ప్రియుడి పుట్టినరోజును జరుపుకోలేదన్న బాధ, ఫోన్ చేసినా తీయలేదన్న కోపంతో శరణ్య తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శరణ్య మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.