శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (19:10 IST)

ప్రియుడుతో కలిసివున్న భార్య.. కళ్లారా చూసిన భర్త సూసైడ్

తన భార్య మరో వ్యక్తితో కలిసివుండటాన్ని కట్టుకున్న భర్త కళ్లారా చూశాడు. తన భార్య పరాయి వ్యక్తితో శారీరకంగా కలిసివుండటాన్ని జీర్ణించుకోలేని ఆ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషాదకర సంఘటన అనంతపురం జిల్లా రొళ్ళ వడ్రహట్టి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి హనుమంత రాయప్ప కుమారుడు పీజీ.నాగరాజు (28)కు అదేగ్రామానికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం వివాహమైంది యేడాది వరకు దాంపత్య జీవనం సాఫీగా సాగింది. 
 
అనంతరం అదే గ్రామానికి చెందిన హెచ్‌.నాగరాజు అలియాస్‌ బిల్లాతో మృతుడి భార్య సన్నిహితంగా ఉంటుండేది. క్రమేపి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. గత గురువారం మృతుడి భార్య ప్రియుడు హెచ్‌.నాగరాజుతో కలిసి ఉండటాన్ని గమనించిన భర్త పీజీ.నాగరాజు భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. 
 
అప్పటినుంచి రెండు, మూడు రోజులుగా ఆచూకీ లేకపోయింది. ఇందిరమ్మ కాలనీ సమీపంలో చెట్టు కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతుడి తండ్రి హనుమం తరాయప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు.