గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (18:34 IST)

విదేశాల్లోభార్య.. మరదలకు లైన్ వేసిన బావ.. బ్లాక్ మ్యాజిక్ ప్లాన్ రివర్సైంది

woman
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త మెడికల్ లేబరేటరిలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య నర్సుగా ఉద్యోగం చేస్తోంది. భర్తతో చిన్న గొడవతో పుట్టింటికి వెళ్లింది. అక్కడ నుంచి భార్యకు విదేశాల్లో ఉద్యోగం రావడంతో విదేశాలకు వెళ్లింది. భార్య విదేశాలకు వెళ్లిన తరువాత భర్త ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. కొన్ని నెలల తరువాత భార్య చెల్లిని లైన్‌లో పెట్టిన భర్త ఆమెతో టచ్‌లో ఉన్నాడు.
 
భార్య కంటే మరదలు అందంగా ఉండటం, భార్య విదేశాల్లో ఉండటంతో అతను మరదలిని లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. ఇందుకోసం బ్లాక్ మ్యాజిక్‌ను ఎంచుకున్నాడు. అంతే సీన్ రివర్సైంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని వాణియంబాడిల సమీపంలోని వూంగలం ప్రాంతంలో రాజేష్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు మూడు సంవత్సరాల క్రితం తన్మోళి (23) అనే యువతిని రాజేష్ ప్రేమించాడు. సంవత్సరం పాటు సంతోషంగా తిరిగిన ప్రేమికులు రాజేష్, తన్మోళి తరువాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.
 
ప్రేమ వివాహం చేసుకున్న రాజేష్, తన్మోళి దంపతులు సంతోషంగా కాపురం చేశారు. కొంతకాలం తరువాత రాజేష్, తన్మోళి దంపతు మద్య చిన్న గొడవ జరగడంతో తన్మోళి కోపంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ నుంచి విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లింది.  
 
రాజేష్ మాత్రం ఇక్కడే ఉద్యోగం చేసుకున్నాడు. కొన్ని నెలల తరువాత భార్య తన్మోళి చెల్లిని లైన్‌లో పెట్టిన రాజేష్ ఆమెతో టచ్‌లో ఉన్నాడు. అయితే బావ రాజేష్ వలలో పడకుండా మరదలు తప్పించుకుని తిరిగింది. ఒంటరిగా వెలుతున్న మరదలి నోటిలో మత్తు మందు కలిపిన వసీకరణ మందు పోసి ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించిన రాజేష్ స్కెచ్ రివర్స్ అయ్యింది.
 
తన్మోళిని చెల్లెలులు గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు రాజేష్‌ను పట్టుకుని చితకబాదేసి పోలీసులకు అప్పగించారు. మత్తు మందు, వసకీరణ ముందు తాగడంతో అస్వస్థతకు గురైన యువతిని ఆసుపత్రికి తరలించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.