శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 మే 2020 (14:14 IST)

ముంబైకి మరో విపత్తు.. భారీ వర్షాలతో వరదలు తప్పవా?

ముంబైకి మరో విపత్తు పొంచివుంది. ఇప్పటికే కరోనా కారణంగా ముంబై నగరం అట్టుడికిపోతుంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం ముంబైలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫలితంగా వరదలు వెల్లువెత్తే అవకాశం వుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. కాగా.. రుతుపవనాలు సాధారణంగా జూన్ రెండవ వారంలో ముంబైకి పలకరించనున్నాయి. 
 
అయితే ఈసారి వారం ముందుగానే ముంబైలో వరుణుడు ప్రతాపం చూపిస్తాడని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ముంబైలో భారీ వర్షాల కారణంగా, వరద పరిస్థితులు తలెత్తుతాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణాన్ని అంచనా వేసే స్కైమెట్ సొసైటీ అధినేత మహేష్ పలావత్ హెచ్చరించారు. 
 
దక్షిణ గుజరాత్ తీరం వైపు కదులుతున్న అరేబియా సముద్రంలో అత్యల్ప పీడనం ఏర్పడనుంది. ఇది రుతుపవనాలు ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఈ కారణంగా, వర్షాకాలానికి ముందే ముంబైలో భారీ వర్షాలు పడే అవకాశం వుంది. జూన్ మొదటి వారంలో వర్షం కురిసే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.