ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆమెకు 15మంది బాయ్‌ఫ్రెండ్స్..
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆమెకు 15మంది బాయ్‌ఫ్రెండ్స్. చివరికి భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది. ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఐటీ హబ్ బెంగళూరులో చంద్రశేఖర్, శ్వేత దంపతులు నివాసం ఉంటున్నారు. రాత్రి భర్త ఇంటికి వెళ్లాడు. ఉదయం ఇంటి టెర్రాస్ మీద రక్తపుమడుగులో కనిపించాడు.
భర్త మర్మాంగం కోసేసి తల మీద ఎవరో దాడి చేశారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినా అప్పటికే అతని ప్రాణం పోయింది. ఈ హత్య కేసులో అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. ప్రియుడి సాయంతో భర్తను కడతేర్చినట్లు తెలిసింది.
సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన చంద్రశేఖర్ బెంగళూరు యలహంకలో నివాసం ఉంటున్నాడు. అక్క కూతురు శ్వేతాని చంద్రశేఖర్ వివాహం చేసుకున్నాడు. అయితే మామతో పెళ్లి ఇష్టం లేదని పోలీసుల విచారణలో తేలింది.
బెంగళూరులో ఎంఎస్‌సీ చదివిన శ్వేత కాలేజీలో పలువురు స్నేహితులతో డేటింగ్ చేసింది. కనీసం 15 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారని, కొన్నిరోజులు షికార్లు చేసిన తరువాత వారిని బ్లాక్ లిస్టులో పెట్టేదని తెలిసింది. దీంతో తన భర్త చంద్రశేఖర్ బతికుంటే మనం కలుసుకోవడం కష్టం అని అనుకున్న శ్వేతా ఆమె భర్త చంద్రశేఖర్ హత్యకు స్కెచ్ వేసి హత్య చేసింది.