Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రొమాన్స్‌కు నిరాకరించిందని.. కొడవలితో నరికి చంపేసిన ప్రియుడు..

బుధవారం, 5 జులై 2017 (16:56 IST)

Widgets Magazine
murder 1

రొమాన్స్‌కు నిరాకరించిందని తన ప్రియురాలిని ఓ దుండగుడు దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడులోని నెల్లైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నెల్లై జిల్లాలోని ఓ హాస్టల్‌లో ఆనంది (38) పనిచేస్తోంది. ఈమె దారుణంగా హత్యకు గురైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
భర్తను కోల్పోయిన ఆనంది.. తన ఇద్దరు కుమారులతో అదే హాస్టల్‌లో బసచేసి పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే ముక్కూడల్ ప్రాంతంలోని సింగం పారైకి చెందిన సెల్లప్ప (50)తో ఆనందికి వివాహేతర సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది. వీరిద్దరూ రహస్యంగా కలుసుకోవడం చేసేవారని... కానీ హాస్టల్‌కు వెళ్ళిపోయాక ఆనంది సెల్లప్పతో సంబంధాలను తెంచుకుందని తెలిసింది.
 
అయితే హాస్టల్ వద్దకు వెళ్ళిన సెల్లప్ప ఆనందిని రొమాన్స్ కోసం ఒత్తిడి చేశాడు. అయితే ఆనంది అందుకు అంగీకరించలేదు. హాస్టల్‌లో ఇవన్నీ కూడదని ఆనంది చెప్పినా సెల్లప్ప వినలేదు. దీనిపై ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన సెల్లప్ప... అక్కడే వున్న కొడవలితో ఆనందిపై దాడి చేశాడు. ఆపై అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆనంది.. ప్రాణాలు కోల్పోయింది. పరారిలో ఉన్న సెల్లప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ దర్యాప్తులో తానే ఆనందిని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భారత సైన్యాన్ని మట్టుబెట్టే శక్తి మాకుందన్న చైనా మీడియా.. బర్రెలు, గొర్రెలు తోలిన వాజ్‌పేయ్!

సిక్కిం ప్రాంతంలోనికి ప్రవేశించిన భారత సైనిక దళాలను మట్టుబెట్టే శక్తి తమ సైన్యానికి ఉందని ...

news

గౌరవంగా వెళ్లండి లేదా తన్ని తరిమేస్తాం : భారత్‌కు చైనా వార్నింగ్

భారత్ సైన్యానికి చైనా వార్నింగ్ ఇచ్చింది. డోకా లా ప్రాంతం నుంచి గౌరవప్రదంగా తప్పుకుంటే ...

news

#Modiiniisrael : మోషేను ఆప్యాయంగా పలకరించిన ప్రధాని మోడీ.. ఎవరీ మోషే?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయేల్ పర్యటనలో పూర్తి బిజీగా గడుపుతున్నారు. అదేసమయంలో ...

news

ఉద్యోగం ఇప్పిస్తానని రాయ్‌చూర్ తీసుకెళ్లాడు.. బీటెక్ యువతిని వాడేసుకున్నాడు...

ఉద్యోగం పేరుతో బీటెక్ పట్టభద్రురాలు మోసపోయింది. ఆమెకు ఉద్యోగం ఆశచూపి కర్ణాటక రాష్ట్రంలోని ...

Widgets Magazine