సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2020 (13:51 IST)

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అంధురాలిపై అత్యాచారం..

ఉత్తరప్రదేశ్‌లో అతివలకు రక్షణ లేకుండా పోతోంది. హథ్రాస్‌ ఘటనలపై ఓవైపు నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతుండగానే.. మరికొన్ని సంఘటనలు వెలుగుచూశాయి. తాజాగా యుపీలోని ముజఫర్‌ నగర్‌లో మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకున్నాయి. గన్‌ పాయింట్‌లో పెట్టి ఓ మహిళను చెరుకు తోటల్లోకి లాక్కొళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 
 
మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శర్వణ్‌ కుమార్‌ అనే నిందితుణ్ని అరెస్టు చేశామని పోలీసులు సోమవారం తెలిపారు. ఐపిసి సెక్షన్‌ కింద పలు కేసులు నమోదు చేశామని చెప్పారు. అలాగే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ అంధురాలిపై కొన్ని నెలలుగా సమీప బంధువొకరు అత్యాచారానికి పాల్పడ్డాడని మరో సంఘటనకు సంబందించిన వివరాలను పోలీసులు తెలిపారు. ఆ నిందితునిపై ఐపీసీలోని 376, 420 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామన్నారు.