గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (11:06 IST)

ఏటీఎంకు వెళ్తే అక్కడ కూడా రేప్.. కిడ్నాప్ చేసి..?

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని ఏటీఎంలో ఓ మహిళపై ఇద్దరు కామాంధులు లైంగికంగా దాడి చేశారు. వివరాల్లోకి వెళితే కటక్ సిటిలోని పిలిగ్రిమ్ రోడ్డు సమీపంలోని ఏటీఎంలో ఆదివారం రాత్రి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏటీఎంలో మనీ డ్రా చేసుకుందామని వచ్చిన మహిళను కిడ్నాప్ చేసి.. అక్కడే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
ఆపై ఆమెను సమీపంలోని పొలాల్లో పడేశారు. స్థానికులు అచేతనంగా పడివున్న అత్యాచార బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి పరిస్థితి విషమంగా వుందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న నిందితులను అరెస్ట్ చేసే దిశగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.