సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (10:01 IST)

World Architecture Day: థీమ్, ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

World Architecture Day
World Architecture Day
నేడు ప్రపంచ నిర్మాణ దినోత్సవం. 1985లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ (UIA) రూపొందించిన ప్రపంచ ఆర్కిటెక్చర్ దినోత్సవాన్ని యూఎన్ అక్టోబర్ మొదటి సోమవారం జరుపుకుంటారు. ప్రపంచ వాస్తుశిల్పి లేదా నిర్మాణ దినోత్సవాన్ని జరుపుకోవడం లక్ష్యం.. గ్రామాభివృద్ధి పట్టణాభివృద్ధి. ప్రపంచ వాస్తుశిల్పి దినోత్సవాన్ని అక్టోబరు మొదటి సోమవారం ఒక థీమ్‌తో జరుపుకుంటారు.
 
ఈ సంవత్సరం థీమ్ "ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం స్వచ్ఛమైన వాతావరణం" అనేది. మన చుట్టూ వున్న ప్రాంతాన్ని సురక్షితంగా, శుభ్రంగా నిర్మించుకోవడం ద్వారా అంటువ్యాధులు దరిచేరవు. ఇంకా వాతావరణాన్ని స్వచ్ఛంగా మార్చుకోగలుగుతాం. అలాగే గృహాలు లేని వారికి ఇంటి సముదాయాలను నిర్మించడం వంటివి చేయడమే ఈ రోజు లక్ష్యం. 
 
ప్రపంచవ్యాప్తంగా 1.8 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు తగిన గృహాలను కలిగి లేరు. 2030 నాటికి, ప్రపంచ జనాభాలో 40 శాతం మందికి తగిన గృహాలు, ఉపాధి, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవలను పొందేందుకు ఒక ముందస్తు షరతు అవసరమని యూఎన్ అంచనా వేసింది.
 
ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారికి అనుగుణంగా ప్రభుత్వ భవనాలు, బహిరంగ ప్రదేశాల నిర్మాణం వుండేలా రూపొందించాలి. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కొనేలా.. నగరాలను నిర్మించడం ఈ రోజు యొక్క ప్రత్యేకం. 
 
వాతావరణంలో ఏర్పడే మార్పు నగరాలపై ప్రభావం చూపుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం అంచనా ప్రకారం గ్లోబల్ కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తికి 75 శాతం నగరాలు కారణమవుతున్నాయి, రవాణాతో పాటు భవనాల నిర్మాణం ఇందుకు కారణం అవుతున్నాయి. 
 
నిర్మించిన భవనాల అనుగుణంగా పర్యావరణం యొక్క సంక్లిష్ట సవాళ్లకు ప్రతిస్పందించడానికి వాస్తుశిల్పుల బృందం ఏర్పడింది. వీరి అంచనా ప్రకారం పర్యావరణానికి అనుగుణంగా భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఇంకా పరిసరాలను శుభ్రంగా పరిరక్షించడం ద్వారా భావితరాలకు అనువైన నిర్మాణాలను అందించగలుగుతాం.