శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (11:35 IST)

బాత్రూమ్‌‌కు వెళ్లిన యువకుడిపై చిరుతపులి దాడి..

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం షిమ్లా నగరంలో ఓ హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది. బాత్రూమ్‌లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఓ యువకుడిపై చిరుతపులి దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది. ప్రస్తుతం ఆ యువకుడు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. షిమ్లాలోని కృష్ణనగర్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణనగర్‌కు చెందిన గౌరవ్ సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు తన ఇంట్లోని బాత్రూమ్‌కు వెళ్లాడు. అయితే అప్పటికే బాత్రూమ్‌లో దూరి ఉన్న చిరుత అతనిపై దాడిచేసింది. అరుపులు విని అక్కడికి పరుగుతీసిన స్థానికులు చిరుతను బాత్రూమ్‌లోనే ఉంచి తలుపువేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు.
 
అనంతరం పోలీసులకు, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు. అనంతరం తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశారు.