శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (11:28 IST)

నోరూరించే సొరపొట్టు.. ఎలా చేయాలి...?

కావలసిన పదార్థాలు:
సొరచేప ముక్కలు - పావుకిలో
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 3
కొత్తిమీర - 1 కట్ట
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
గరం మసాలా - పావుకిలో 
పసుపు - 1 స్పూన్
ఉప్పు - సరిపడా
నూనె - కొద్దిగా
కారం - 1 స్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
 
తయారీ విధానం:
ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, చేపముక్కలు వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆపై చేప ముక్కలను మాత్రం తీసి చిదిమి పొరటూలా చేయాలి.

ఆ తరువాత నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి 3 నిమిషాల పాటు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర తురుము వేసి 2 నిమిషాలు వేయించి.. ముందుగా మెదిపి పెట్టుకున్న సొరచేప పొట్టు వేసి సిమ్‌లో 4 నిమిషాలు వేయించి దించేయాలి. అంతే నోరూరించే.. సొర పెట్టు రెడీ...