శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By
Last Updated : గురువారం, 24 జనవరి 2019 (14:10 IST)

సజ్జల పకోడీలు ఎలా చేయాలో తెలుసా..?

కావలసిన పదార్థాలు:
సజ్జ పిండి - అరకప్పు 
సెనగ పిండి - అరకప్పు
ఉల్లి తరుగు - పావుకప్పు
క్యారెట్ తురుము - పావుకప్పు
పచ్చిమిర్చి - 2
ఉప్పు - తగినంత
కారం - సరిపడా
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా ఒక పాత్రలో సజ్జ పిండి, సెనగపిండి ఉల్లి తరుగు, క్యారెట్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ 10 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి. ఆపై బాణలిలో నూనెను పోసి వేడి చేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పకోడీల్లా చేసి నూనెలో వేసి వేయించుకోవాలి. ఈ పకోడీలు బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే... సజ్జల పకోడీలు రెడీ.