శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : శుక్రవారం, 18 జనవరి 2019 (20:56 IST)

ఉలవచారు చికెన్ బిర్యానీ..?

కావలసిన పదార్థాలు:
బాస్మతీ రైస్ - 1 కేజీ
చికెన్ - 1 కేజీ
ఉలవలు - అరకిలో 
నిమ్మకాయలు - 2
ఉల్లిపాయలు - అరకప్పు
పెరుగు - కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
పచ్చిమిర్చి - 3
పుదీనా - పావుకప్పు
బిర్యానీ ఆకులు - 4
నెయ్యి - 100 గ్రా
బిర్యానీ మసాలా - కొద్దిగా
పసుపు - 50 గ్రా
ఉప్పు - తగినంత
కారం - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నెయ్యి వేసి మసాలా దినుసులు వేయించాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు వేసి దోరగా వేయించి ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పెరుగు, లీటర్ నీరు పోసి మూత పెట్టుకోవాలి. కాసేపటి తరువాత బాస్మతి బియ్యం, ఉప్పువేసి ఉడికించాలి. ఇప్పుడు మరో బాణలిలో స్పూన్ నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించి ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి.

ఈ మిశ్రమలో అరలీటర్ నీరు పోసి చికెన్ బాగా ఉడికించుకోవాలి. ఆ తరువాత అందులో అరకిలో ఉలవలు వేసి పసుపు, ఉప్పు, కారం వేసి కాసేపు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా చేసుకున్న బిర్యానీలో కలిపి పైన కొత్తిమీర చల్లి తీసుకుంటే.. ఘుమఘుమలాడే వేడి వేడి ఉలవచారు చికెన్ బిర్యానీ రెడీ.