బిర్యానీలో లెగ్‌పీస్ లేదని యజమానికి చావబాదిన కస్టమర్లు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లోగల బాబూపుర్వా కొత్వానీ అనే ప్రాంతంలో ఖలీద్ అనే ఓ వ్యక్తి బిర్యానీ దుకాణం నడుపుతున్నాడు. ఈ దుకాణానికి కొందరు వ్యక్తులు బిర్యానీ ఆరగించేందుకు వెళ్లారు. తమకు కావాల్సిన వివిధ రకాలైన వంటకాలను, బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు.
అయితే, సరఫరా చేసిన బిర్యానీలో లెగ్‌పీస్ లేదని యజమానిని కోరారు. దీనికి ఆయన ససేమిరా అన్నారు. దీంతో మరికొంతమంది తమ స్నేహితులను పిలిపించి ఆ దుకాణం యజమానిని చావబాదారు.
అంతటితో ఆగక అక్కడున్న వారికి కత్తి చూపిస్తూ చంపేస్తామని కూడా బెదిరించారు. కాగా ఈ ఘటన అంతా సీసీటీవీలో రికార్డయ్యింది. నిందితులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. బాబురార్వాలోని ఖాలిద్‌కు చెందిన బిరియానీ దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.