శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (11:23 IST)

చింతచిగురు రొయ్యల కూర..?

కావలసిన పదార్థాలు:
చింత చిగురు - 1 కప్పు
పెద్ద రొయ్యలు - పావుకిలో
ధనియాల పొడి - స్పూన్
జీలకర్ర పొడి - అరస్పూన్
ఉల్లిపాయ - 1
కొత్తిమీర - 1 కట్ట
వెల్లుల్లి రేకులు - 5
నూనె - సరిపడా
గసగసాల పొడి - స్పూన్
దాల్చిన చెక్క పొడి - అరస్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ - స్పూన్
పసుపు - కొద్దిగా
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - 5
కారం - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా రొయ్యలని శుభ్రం చేసి పెట్టుకుని అందులో పసుపు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వాటికి పట్టేట్టుగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెవేసి అది బాగా వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిముక్కలు వేగాక అందులో రొయ్యలు కూడా వేసుకోవాలి. ఆపై రొయ్యలు పచ్చివాసన పోయేవరకు వేయించి మూతపెట్టి మరికాసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు చింతచిగురు పొడిని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గసగసాల పొడి, జీలకర్ర పొడి, దాల్చిన చెక్కపొడి, ధనియాలపొడి వేసుకోవాలి. అవన్నీ వేసి బాగా కలుపుకుని తర్వాత కాసిన్ని నీళ్లు పోసి మూతపెట్టుకోవాలి. చివరగా కొత్తిమీరతో అలంకరిస్తే సరిపోతుంది. అంతే వేడివేడి చింతచిగురు రొయ్యల కూర రెడీ.