శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By
Last Modified: మంగళవారం, 6 ఆగస్టు 2019 (21:14 IST)

ఓ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టేందుకు స్థానిక, జాతీయ సంస్థల ఆధ్వర్యంలో NATs రన్ ఫర్ రామ్...

ఫిలడెల్ఫియా: ఆపదలో ఉన్న తెలుగువారిని ఆదుకోవడంలో ఎప్పుడూ నాట్స్ ముందుంటుందనేది మరోసారి రుజువైంది. అమెరికాలో ఇటీవల ప్రమాదానికి గురై మృత్యువుతో పోరాడుతున్న కొయ్యలమూడి రామ్మూర్తి ప్రాణాలు నిలబెట్టేందుకు నాట్స్ తన వంతు సాయం చేయాలని ముందుకొచ్చింది. అతని కుటుంబానికి వైద్య ఖర్చులను కొంత భరించేందుకు నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా విరాళాల సేకరణ చేయాలని నిశ్చయించింది. ఈ మొత్తాన్ని రామమూర్తి కుటుంబానికి నాట్స్ విరాళంగా అందించనుంది.
 
ఇందుకోసం ఫిలడెల్ఫియాలోని స్థానిక తెలుగు సంఘం టీఏజీడీవీతో కలిసి నాట్స్ రన్ ఫర్ రామ్ పేరుతో 5కె రన్ చేపట్టింది. స్థానికంగా ఉండే తెలుగువారు ఈ 5కె రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 120 మందికి పైగా ఈ రన్‌లో పరుగులు తీశారు. దీంతో పాటు తమ సేవా గుణాన్ని కూడా చాటుకున్నారు. ఫిలడెల్ఫియా తెలుగు అసోసియేషన్, ఆటా, నాటా, తానా, సేవా సంస్థల ప్రతినిధుల సంఘీభావంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
 
నాట్స్ బోర్డు డిప్యూటీ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, TAGDV ఎగ్జిక్యూటివ్ కమిటీ నుండి కిరణ్ కొత్తపల్లి, చైతన్య పెద్దు, రామ్ కొమ్మనబోయిన, వేణు సంఘాని తదితరులు హాజరై తమవంతు సంఘీభావాన్ని ప్రకటించారు.