శుభోదయం : సోమవారం రాశిఫలాలు.. స్త్రీలు పంతాలకు పోరాదు...

సోమవారం, 13 నవంబరు 2017 (06:02 IST)

daily astro

మేషం: ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలెదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం: వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆదాయానికి తగినట్లుగా ధనం వ్యయం చేస్తారు. తరచూ బంధుమిత్రుల రాకపోకలుంటాయి ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. రిప్రజెంటివ్‌లకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు.
 
మిథునం: రుణవిముక్తులు కావడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. భాగస్వామిక చర్చలలో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. శత్రువులపై జయం సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలు పంతాలకు పోకుండా విజ్ఞతతో వ్యవహరించవలసి వుంటుంది.
 
కర్కాటకం: ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరించండి. మీ అతిథి మర్యాదలు ఎదుటివారిని సంతృప్తిపరుస్తాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంచడం మంచిది. తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. సంఘంలో మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి.
 
సింహం : బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఆలయాలను సందర్శిస్తారు. కళ, సాంస్కృతిక, బోధన, విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
కన్య: సన్నిహితులతో మీ కష్టాలు చెప్పుకోవడం వల్ల మానసికంగా కుదుటపడతారు. రిప్రజెంటివ్‌లకు ఉపాధ్యాయులకు సదవకాశాలు లభించగలవు. దూర ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భాగస్వామ్యుల మధ్య ఒడిదుడుకులు తలెత్తగలవు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి.
 
తుల : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు ప్రణాళికలు మునుముందు మంచి ఫలితాలనిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన  అవసరం. దూరంలో ఉన్న ప్రియతముల ఆరోగ్య విషయంలో ఆందోళన చెందుతారు. మీ సంతానం కోసం ధనం బాగుగా ఖర్చుచేస్తారు.
 
వృశ్చికం: బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి.
 
ధనస్సు: స్త్రీలు అందరితోను కలుపుగోలుగా వ్యవహరిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. ప్రముఖులను కలుసుకుంటారు. మీ శ్రీమతి నుంచి అన్ని విధాలా ప్రోత్సాహం లభిస్తుంది. సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు  పూర్తి చేస్తారు.
 
మకరం: విదేశీయానం యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ వంటి శుభపరిణామాలున్నాయి. వ్యాపారాల్లో పోటీ ఆందోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య అపోహలు తొలగి అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.
 
కుంభం: కార్యదీక్షతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. వృత్తి వ్యాపారులకు అన్నివిధాలా పురోభివృద్ధి. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు రాతపరీక్షల్లో మెలకువ అవసరం. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మీనం : స్త్రీలకు ఆరోగ్య భంగం, నీరసం వంటి చికాకులు తప్పవు. దైవ కార్యాలు, వేడుకల్లో పాల్గొంటారు. మీకు అందిన చెక్కులు చెల్లక ఇబ్బంది పడతారు. ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత వహించిన ఫలితం పొందుతారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. దైవ  సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనిపై మరింత చదవండి :  
November 13 Today Astro Daily Prediction Today Prediction Daily Horoscope Prediction

Loading comments ...

భవిష్యవాణి

news

శుభోదయం : ఆదివారం నాటి రాశిఫలాలు.. దానధర్మాలు చేస్తారు...

మేషం: ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. వేడుకల్లో ...

news

12-11-2017 నుంచి 18-11-2017 వరకు మీ వార రాశి ఫలితాలు

కర్కాటకంలో రాహువు, కన్యలో కుజుడు, తులలో రవి, శుక్ర గురువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో ...

news

శుభోదయం : శనివారం దినఫలాలు .. అవకాశాలు వెతుక్కుంటూ

మేషం : బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. విద్యార్థులు బజారు ...

news

శుభోదయం : 10-11-2017 మీ రాశి ఫలితాలు, రావలసిన ఆదాయం...

మేషం : ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు ...