సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

నవరాత్రి ఉత్సవాలు.. స్కంధ మాతను ఐదో రోజు పూజిస్తే..?

Durga

 
నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 17వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నవరాత్రులు అక్టోబర్ 25న ముగియనున్నాయి. ఈ క్రమంలో నవరాత్రుల్లో ఐదో రోజైన (అక్టోబర్ 21) బుధవారం పూట దుర్గామాతను పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. 
 
నవరాత్రి 2020.. ఐదో రోజు లలితా దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది. నైవేద్యంగా దద్ద్యోజనం సమర్పిస్తారు. ఈ అవతారం రాక్షస సంహారం గావించిందని భక్తుల నమ్మకం. అమ్మవారిని నీలం రంగు చీరతో అలంకరించి భక్తులు ఉపంగ లలితా గౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు భక్తులు తెలుపు రంగు దుస్తులు ధరించాలి. స్కందమాత అంటే కుమారస్వామికి మాత. 
 
నవరాత్రిలో ఐదో రోజున అమ్మవారిని పూజించే వారికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది. స్కందమాత సింహం పైన ఆశీనురాలై నాలుగు చేతులు కలిగివుంటుంది. పై రెండు చేతుల్లో తామర పువ్వు, కింది కుడి చేతితో అభయ ముద్ర కలిగి వుంటుంది. ఎడమ చేతిలో కుమారస్వామిని ప్రేమగా పట్టుకుని దర్శనమిస్తుంది. 
 
ఎరుపు రంగు దుస్తులతో అమ్మవారిని అలంకరిస్తారు. పంచమి తిథిన వచ్చే ఈ రోజున స్కంధమాతను పూజిస్తే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే కుమార స్వామిని పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఆమె పై రెండు చేతుల్లో తామర పువ్వులను మోస్తూ... స్కంధుడిని తన కుడి చేతుల్లో ఒకటి పట్టుకుని, మరొక కుడిచేతి ద్వారా అభయ ముద్రను కలిగివుంటుంది.