శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : బుధవారం, 7 జూన్ 2017 (11:25 IST)

అప్పుల నుంచి విముక్తి లభించాలంటే.. కంచి కామాక్షి అమ్మవారికి పట్టుచీరను?

ఎంతటి అప్పుల బాధనైనా తీర్చే శక్తి కంచి కామాక్షీ దేవికి వుంది. అమావాస్యకు తర్వాత చిత్తా నక్షత్రం రోజున పట్టుచీరను సమర్పించి.. దేవికి పూజ చేసేవారికి అప్పుల భాధలుండవు. అలాగే అప్పుల నుంచి విముక్తి లభిస్తు

ఆర్థిక ఇబ్బందులున్నాయా? ఈతిబాధలు తొలగిపోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. 
ఓం అగత్తీశాయ నమః
ఓం నందీశాయ నమః 
ఓం తిరుమూల దేవాయ నమః 
ఓం కరువూర్ దేవాయ నమః 
ఓం రామలింగ దేవాయ నమః - అనే ఈ సిద్ధుల నామాలను రోజూ తొమ్మిది సార్లు.. అలా ఏడాది పాటు పూజ గదిలో దీపమెలిగించి జపించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా కొన్ని పరిహారాల ద్వారా ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఉదయం పూట శుచిగా స్నానమాచరించి.. కొంచెం పంచదారను తీసుకుని.. వాకిలికి బయట చల్లితే... ఆ పంచదార చీమలకు ఆహారంగా మారుతుంది. అలా కంటికి తెలియని చిన్న ప్రాణులకు పంచదార ఆహారంగా లభించడం ద్వారా ఆర్థిక నష్టాలుండవు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. 
 
ఎంతటి అప్పుల బాధనైనా తీర్చే శక్తి కంచి కామాక్షీ దేవికి వుంది. అమావాస్యకు తర్వాత చిత్తా నక్షత్రం రోజున పట్టుచీరను సమర్పించి.. దేవికి పూజ చేసేవారికి అప్పుల భాధలుండవు. అలాగే అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంకా గురువారం పూట కొంచెం కుంకుమను తీసి పెట్టుకుని శుక్రవారం పూట అమ్మవారి ఆలయాల్లో నైవేద్యంగా 11వారాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 
 
చపాతీల కోసం గోధుమలను పిండికొట్టించుకునేటప్పుడు అందులో ఏడు తులసీ ఆకులు కాసింత కుంకుమ పువ్వులు చేర్చి రుబ్బుకోవాలి. ఆ పిండి ఇంట్లో ఉన్నంతవరకు ఆర్థిక ఇబ్బందులు వుండవు. వరుసగా శుక్రవారం మహాలక్ష్మీదేవి సన్నిధిలో మల్లెపువ్వులతో మాలను సమర్పించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు.