మేషరాశిలో జన్మించిన మహిళల ఫలితాలు...!

Last Updated: మంగళవారం, 19 మార్చి 2019 (18:04 IST)
మేషరాశిలో జన్మించిన మహిళలు కార్యాచరణలో అధిక శ్రద్ధను వహిస్తారు. కుజ, చంద్ర, సూర్య గ్రహాలు ఉచ్ఛస్థానంలో ఆధిపత్యం వహించడంతో ఎలాంటి కార్యాన్నైనా పలు మార్లు ఆలోచించిన తర్వాతనే ఆచరించాలి. కట్టుదిట్టాలపై అధిక నమ్మకం వహిస్తారు. అందరితోను మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తారు. అయితే అప్పుడప్పుడూ కోపపడటం వీరి స్వభావం.

మేషరాశిలో జన్మించిన మహిళలు భోజన ప్రియులుగా ఉంటారు. ఇతరులు వీరి వద్ద మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని ఆశిస్తారు. ధృఢధైర్యలుగాను, విదేశ ప్రయాణంలో అధికంగా ఆసక్తి చూపేవారుగాను ఉంటారు. అయితే వీరు నిలకడ లేని మనస్సు కలవారుగాను, ఇతరులను నొప్పించే విధంగాను ఉంటారు.

వీరి జాతక ప్రకారం శుక్ర గ్రహ ఆధిపత్యం చేత జీవితంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి. ధర్మ చింతన, సౌందర్యానికి ముఖ్యత్వం ఇవ్వడంలో అధిక శ్రద్ధ వహిస్తారు. ఆభరణాలు, నూతన వస్త్రాలు ధరించడంలో అధికంగా ఆసక్తి చూపుతారు. విద్యా రంగంతో పాటు సంగీతం వంటి రంగాల్లో కూడా ఈ మహిళా జాతకులు రాణించగలరు.దీనిపై మరింత చదవండి :