సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 మే 2024 (21:23 IST)

బుద్ధ పౌర్ణమి.. వైశాఖ పౌర్ణమి పూజ.. దానాలు.. ఇవి కొంటే?

Pournami
వైశాఖ పౌర్ణమి మే 22వ తేదీ సాయంత్రం 5.42 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మే 23వ తేదీ సాయంత్రం 6.42 గంటలకు ముగుస్తుంది. తిథి వ్రతం మే 23న మాత్రమే ఆచరిస్తారు. ఈ రోజున శ్రీయంత్రం, బుద్ధుని విగ్రహం, ఇత్తడి ఏనుగు విగ్రహం ఇంటికి తెచ్చుకోవడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. ఈ రోజు ఇంట్లో బంగారు లేదా వెండి నాణేలను ఉంచడం కూడా శుభప్రదంగా భావిస్తారు. తద్వారా లక్ష్మీదేవికి సంతోషం కలిగి, అనుగ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు. 
 
వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసం ఉండడం వల్ల అదృష్టం మరియు ఆరోగ్యం చేకూరుతుందని నమ్ముతారు. ఈ రోజున, విష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి సత్య నారాయణ పూజను నిర్వహిస్తారు. అదనంగా, భక్తులు ఈ రోజు ధర్మరాజును కూడా పూజిస్తారు. 
 
శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన సుదామను వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసం పాటించమని చెప్పినట్లు విశ్వాసం. తద్వారా సంపదను పొందాడని నమ్మకం. ఈ రోజున బ్రాహ్మణుడికి నీటితో నింపిన కుండను దానం చేస్తారు. కొందరు వైశాఖ పూర్ణిమ నాడు పంచదార, నువ్వులు దానం చేస్తే పాపాలు హరించుకుపోతాయని పండితులు అంటున్నారు.