కలలు ఎందుకు వస్తాయో తెలుసా?

కల అనే రెండు అక్షరాలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కలలు కంటూనే ఉంటారు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఇలా అన్ని దశల్లోను కలలనేవి వస్తూనే ఉంటాయి. కలలనేవి మనసులోని భావాలే దృశ్య రూపాలుగా కని

Kowsalya| Last Updated: మంగళవారం, 7 ఆగస్టు 2018 (14:54 IST)
కల అనే రెండు అక్షరాలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కలలు కంటూనే ఉంటారు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఇలా అన్ని దశల్లోను కలలనేవి వస్తూనే ఉంటాయి. కలలనేవి మనసులోని భావాలే దృశ్య రూపాలుగా కనిపిస్తుంటాయి. ఇందువలనే కలలు వయసును బట్టి వారి ఆలోచనలను బట్టి వస్తుంటాయి.
 
పిల్లలకు ఆటపాటలకు సంబంధించిన కలలు, వృద్ధులకు దైవ సంబంధమైన కలలు వస్తుంటాయి. యవ్వనంలో మనసు ఉత్సాహంతో, ఉల్లాసంతో నిండి ఉంటుంది. కాబట్టే అందమైన కలలు వస్తుంటాయి. మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటే అందమైన కలలు వస్తుంటాయి. అది ఆందోళనకి లోనైతే పీడకలలు వస్తుంటాయి. పీడ కలలు వస్తే అది నిజం కాకూడదని దైవాన్ని ప్రార్ధించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. 
 
కొంతమందికి ఒక్కోసారి వారి భావాలకు సంబంధంలేని కలలు వస్తుంటాయి. ఆ కలలు వారికి ఆనందాన్ని లేదా ఆందోళన కలిగించేలా ఉండొచ్చు. ఇలాంటి కలలు వచ్చిన సమయాన్ని బట్టి అవి నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని స్వప్న శాస్త్రంలో చెప్పబడుతోంది.
 
సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక భాగం, 9 నుంచి 12 వరకు రెండో భాగం, 12 నుంచి 3 వరకు మూడో భాగం, 3 నుంచి 4 వరకు నాల్గొవ భాగంగా పేర్కొంది. ఈ నాలుగు భాగాలలో రెండో భాగంలో వచ్చిన కలలు ఏడాదిలోగా ఫలితాలు చూపుతాయనీ, మూడవ భాగంలో వచ్చిన కలలు ఆరు నెలలోగా ఫలితాలు చూపుతాయని స్పష్టం చేయబడుతోంది. దీనిపై మరింత చదవండి :