మాంసాహారం తిని తలంటుస్నానం చేసి.. ఆలయానికి వెళ్లొచ్చా..?

Last Updated: మంగళవారం, 29 జనవరి 2019 (17:06 IST)
మాంసాహారం తిన్నప్పటికీ  స్నానం చేసి దర్శనం చేసుకోవచ్చునని కొందరు భావిస్తారు. కానీ అది ఎంత మాత్రం సరికాదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే పూజలు, వ్రతాలు, దీక్షలు చేస్తున్నప్పుడు.. ఇంకా పుణ్యదినాల్లో మాంసాహారం తీసుకోకూడదని.. వారు సూచిస్తున్నారు. మాంసాహారం తమో గుణాన్ని, రజో గుణాన్ని ప్రేరేపిస్తుంది. 
 
ఆధ్యాత్మిక పూజలు చేసేటప్పుడు మనస్సు ప్రశాంతంగా వుండాలి. సాత్విక భావనతో నిండిపోవాలి. ఆ భావనతో భగవంతుడిని పూజించాలి. అలా కాకుండా మాంసాహారం తీసుకోవడం ద్వారా సాత్వికత సన్నగిల్లుతుంది. ఇంకా మాంసాహారం అంత తేలికగా జీర్ణం కాదు. సమయం పడుతుంది. ఆ జీర్ణక్రియ ప్రభావంతో మెదడు మందగిస్తుంది. 
 
అందుకే దైవకార్యాలు చేసేటప్పుడు.. దైవ దర్శనానికి వెళ్లే ముందు మాంసాహారాన్ని తినకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. తీసుకున్న ఆహారం ప్రకారమే లక్షణం వుంటుందని.. పొగరుతో వుండే గొర్రె మాంసాన్ని తింటే.. దాని లక్షణాలు దాన్ని ఆహారం తీసుకున్న వారిపై వుంటాయని.. అందుకే మాంసాహారాన్ని తీసుకున్న తర్వాత ఆలయ దర్శనం చేయకూడదు. 
 
అలాగే పూర్తిగా భోజనం చేసి దైవ దర్శనం చేయకూడదని.. ఉపవసించి.. లేదా సాత్విక ఆహారాన్ని తేలికగా తీసుకుని దైవ దర్శనం చేయాలని.. అప్పుడే దైవచింతన వుంటుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :