Widgets Magazine

బుధవారం మీ దినఫలితాలు : సరదాలు.. కోరికలు....

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (08:42 IST)

daily horoscope

మేషం : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. షాపుల స్థల మార్పుతో మరింత అభివృద్ధి సాధ్యం. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి కోర్టు వ్యవహారాలు వాయిదా వేయుట మంచిది. 
 
వృషభం : అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసివస్తాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. రుణాలు, పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సత్ఫలితాలు లభిస్తాయి. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
మిథునం : ముఖ్యుల రాకపోకలు అధికం అవుతాయి. ధాన్యం, అపరాలు, శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. కంది, మిర్చి, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసివచ్చే కాలం. వాతావరణంలో మార్పులు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ సరదాలు కోరికలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. వృత్తిపరమైన చికాకులు ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. బంధువులను కలుసుకుంటారు. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయడం మంచిది. గృహంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
సింహం : రాజకీయ నేతలకు దూర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. శత్రువులు, మిత్రులుగా మారుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. అనుకోని ఖర్చులు ఎదురైనా ధనానికి ఇబ్బందులు ఉండవు. స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. 
 
కన్య : దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చేతి వృత్తుల వారికి ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. గృహంలో ఏదేనా వస్తువు పోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. 
 
తుల : వ్యాపారులకు పోటీ పెరగడంతో ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. వాహనం యోగం కలదు. హామీలు ఉండటం మంచిది కాదు. అని గమనించండి. ఆడిటర్లకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఇతరుల ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోకండి. 
 
వృశ్చికం : ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు అధికమిస్తాయి. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. దైవ, సేవ పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. స్థిరచరాస్తుల కొనుగోలు విషయమై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
ధనస్సు : భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఏకాగ్రత, పెద్దల సలహా పాటించడం క్షేమదాయకంగా ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఎదురయ్యే ప్రతి విషయంలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. గృహోపకరణాలు అమర్చుకుంటారు. స్నేహితులు మీ జీవితానికి మూల స్థంభాలుగా మారతారు. 
 
మకరం : కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. సోదరులతో ఏకీభవించలేక పోతారు. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. 
 
కుంభం : మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొడతారు. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. నిరద్యోగులకు పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. ఒక అవసరానికి ఉంచిన ధన మరో ఖర్చుకు వినియోగిచవలసి వస్తుంది. 
 
మీనం : సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో కలిసి పని చేస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. రావలసిన ధనంలో కొంతమొత్తం అందుకుంటారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Daily Horoscope Today Horoscope Today Astrology Daily Prediction

Loading comments ...

భవిష్యవాణి

news

అమ్మో చిత్తా నక్షత్రంలో పుట్టిన మహిళలు ఇలా వుంటారట?

చిత్తా నక్షత్రానికి కుజుడు అధిపతి. ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు తన నిర్ణయమే సరైందని ...

news

మంగళవారం మీ రాశిఫలితాలు : జీవిత భాగస్వామికి...

మేషం: ఆర్థిక పరిస్థితులు కొంత వరకు మెరుగుపడతాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ...

news

సోమవారం మీ రాశిఫలితాలు : ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తే...

మేషం: ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్ ఆర్డర్లు ...

news

పెళ్లిళ్ల సీజన్ మొదలు.. మార్చి 3న 50 వేలకు మించిన వివాహాలు

పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. ఈ నెల 19 నుంచి అక్టోబర్ వరకు అన్నీ మంచి ముహూర్తాలే కావడంతో ...

Widgets Magazine