మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : శనివారం, 14 ఏప్రియల్ 2018 (08:36 IST)

శనివారం (14-04-2018) దినఫలాలు - మీరంటే గిట్టని వ్యక్తులను సైతం...

మేషం: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల రాకపోకలవల్ల గృహంలో సందడి కానవస్తుంది. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. స్త్రీలు ఉదరం, నడుము, నరాలకు సంబంధించిన చికాకుల

మేషం: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల రాకపోకలవల్ల గృహంలో సందడి కానవస్తుంది. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. స్త్రీలు ఉదరం, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనవలసివస్తుంది. ప్రముఖులను కలిసి బహుమతులను అందజేస్తారు.
 
వృషభం: బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. ప్రయాణాలు సజావుగా సాగినా లక్ష్యం నెరవేరదు. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. బకాయిలు, నెలసరి వాయిదాల వసూళ్లలో కలెక్షన్ ఏజెంట్లు లౌక్యంగా మెలగాలి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
మిథునం: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పొందుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.
 
కర్కాటకం: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి అనుకూలం. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. వృత్తుల వారికి చికాకులు, ఒత్తిడి తప్పవు. తలచిన పనుల్లో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. పాత వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
సింహం: మీ శ్రీమతి సలహా పాటించడం ఉత్తమం. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. దూర ప్రయాణాల్లో ఇబ్బందులుండవు. ధనవ్యయం అధికమైనా ఇబ్బంది వుండదు. కొత్త ఆలోచనలు, ఆశయాలతో యత్నాలు సాగిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు వాయిదా పడతాయి.
 
కన్య: పెరిగిన ధరలు, విద్యుత్ బిల్లులు ఆందోళన కలిగిస్తాయి. స్త్రీల ఉద్యోగయత్నం ఫలిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త చాలా అవసరం. మీరంటే గిట్టని వ్యక్తులను సైతం ఆకట్టుకుంటారు. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. మీ వ్యసనాలు, బలహీనతలు అదుపులో వుంచుకోవటం శ్రేయస్కరం. 
 
తుల: ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగును. ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. ఎదురుచూడని అవకాశాలు దగ్గరకు వస్తాయి.
 
వృశ్చికం: రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
ధనస్సు: ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి ఖాతాదారులతో కొత్త సమస్యలు తలత్తే ఆస్కారం వుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తాత్కాలికమేనని గమనించి శ్రమించండి.. అనుకున్నది సాధిస్తారు.
 
మకరం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి తోటివారి ధోరణి ఆందోళన కలిగిస్తుంది. వ్యవసాయ, తోటల రంగాల వారికి, చిన్నతరహా పరిశ్రమల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీల ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం కలదు.
 
కుంభం: ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. స్త్రీలు ఉదరం, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. వైద్యులు శస్త్రచికిత్స చేయునప్పుడు మెళకువ అవసరం. నేడు చేద్దామనుకున్న పనులు రేపటికి వాయిదా వేస్తారు. వ్యాపారాల్లో పోటీని తట్టుకోవటానికి బాగా శ్రమించాలి.
 
మీనం: ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, పరిశ్రమల, సంస్థల స్థాపన విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.