మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

01-07-2020 బుధళవారం రాశిఫలాలు

మేషం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. సాంఘిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరీ, సోదరుల సన్నిహితుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. కార్యసాధనలో ఎవరి సహాయం మీకు లభించదు. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. 
 
వృషభం : సంఘంలో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. గృహంలో ప్రతి వ్యవహారం మీ ఇష్టానుసారమే జరుగుతుంది. మనోనిబ్బరం అన్ని విధాలా అవసరం. మతిమరుపు, ఏకాగ్రత లోపం ఇబ్బందులకు దారితీస్తుంది. 
 
మిథునం : మీరు హాస్యానికి చేసిన వ్యాఖ్యలే వివాదాస్పదమవుతాయి. కొన్ని విషయాలు చూసీచూడనట్టుగా వ్యవహరించాలి. పెద్దల ప్రమేయంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. వైద్య రంగాల వారు అరుదైన ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, పనిభారం అధికం. 
 
కర్కాటకం : ఆహారం, ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రముఖుల సిఫార్సుతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. వ్యాపార ఉపాధి పథకాల్లో స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో మెళకువ అవసరం. పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
సింహం : ఆర్థిక విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. స్త్రీలకు ప్రతి విషయంలోనూ పట్టుదల అధికమవుతుంది. మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాలతో క్షణం తీరికవుండదు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
కన్య : కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లలు మంజూరవుతాయి. ఉద్యోగస్తులు వీలైనంత క్లుప్తంగా సంభాషించడం క్షేమదాయకం. ఆస్తి పంపకాల విషయంలో దాయాదుల ఒత్తిడి అధికం. వ్యవసాయదారులకు ఎరువుల కొనుగోలులో సమస్యలు అధికం. షాపుల అలంకరణ, కొత్త కొత్త పథకాల వల్ల విక్రయాలు గణనీయంగా పెరుగుతాయి. 
 
తుల : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగ వృత్తుల వారికి సామాన్యంగా ఉంటాయి. పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు కొంతకాలం వేచివుండటం ఉత్తమం. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తప్పదు. 
 
వృశ్చికం : స్త్రీలకు ఆరోగ్య భంగం. పనివారలతో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఇంటా బయటా మీ మాటకు మంచి స్పందన ఉంటుంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. 
 
ధనస్సు : ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. బంధువులు, చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. మీ సంతానం వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. ఏ విషయాన్ని తెగేవరకు లాగడం మంచిదికాదు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తికాగలవు. 
 
మకరం : దంపతుల మధ్య సఖ్యత, మానసిక ప్రశాంతత పొందుతారు. కొన్ని బాకీలు, అనుకోకుండా వసూలవుతాయి. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. 
 
కుంభం : ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. రుణాలు, పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహమార్పు కోసం యత్నాలు సాగించండి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త స్కీములు రూపొందిస్తారు. బంధువుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
మీనం : వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. శ్రమాధిక్యత, మితిమీరిన ఆలోచనల వల్ల అస్వస్థతకు లోనవుతారు. క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. చెల్లింపులు, ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.