Widgets Magazine

గురువారం (05-07-2018) దినఫలాలు - మీ అంచనాలు...

గురువారం, 5 జులై 2018 (08:54 IST)

daily astro

మేషం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలవారికి అవకాశాలు లాభిస్తాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. విద్యార్ధులు మంచి ఫలితాలు సాధిస్తారు. భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు.
 
వృషభం: కోర్టుపనులు, లిటిగేషన్లు పరిష్కారమవుతాయి. దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించిన సమాచారం అందుతుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం కాగలవు.   
 
మిధునం: పెన్షన్, భీమా పనులు పూర్తవుతాయి. జన సంబంధాలు మెరుగుపడుతాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి వస్తుంది. అకదనపు ఆదాయమార్గాల కోసం చేసే అన్వేషణ ఫలిస్తుంది. మీ మనోభావాలకు మంచి స్పురణ లభించగలదు. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. 
 
కర్కాటకం: అంచనాలు ఫలించకపోవచ్చు. కోర్టు విషయాల్లో ప్రతికూలత తప్పకపోవచ్చు. దూరంలోవున్న వ్యక్తుల ఆరోగ్యం ఆవేదన కలిగిస్తుంది. మీ వ్యక్తిగత భావాలను గోప్యంగా ఉంచండి. ఖర్చులు అధికమవుతాయి. ఒత్తిడి, నిరుత్సాహం ఎదుర్కుంటారు. తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా ఉంటాయి. 
 
సింహం: వ్యాపారంలో ఆశించినంత ప్రయోజనాలు సాధించడం కష్టం. బంధువుల రాకపోకలుంటాయి. ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. పెద్దల సహకారం లోపిస్తుంది. దైరకార్యాలలో చురుకుగా వ్యవహరిస్తారు.
 
కన్య: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి అనుకూలం. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పండ్ల, పూ, పానీయ వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి అనుకూలం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉమ్మడి నిధుల నిర్వహణలో ఆచితూచి వ్యవహరించండి. స్థిరాస్తి, క్రమవిక్రయాలకు అనుకూలం. 
 
తుల: ప్రముఖులతో కీలకమైన వ్యవహారాలు చర్చలు జరుపుతారు. రాబడికి మించిన ఖర్చులు తప్పనిసరి చెల్లింపుల వలన స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. స్త్రీలు శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తుల వారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి.  
 
వృశ్చికం: ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కున్నప్పటికి ముఖ్యుల సహకారం వలన సమసిపోతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సోదరీసోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగాఉంటాయి. కంప్యూటర్, టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. వృత్తుల వారికి సంతృప్తికరంగా ఉంటుంది.
 
ధనస్సు: నిత్యావసర వస్తు వ్యాపారులకు పురోభివృద్ధి. రావలసిన బాకీలు సకాలంలో అందుతాయి. రాజకీయంలో వారికి కార్యకర్తల వలన చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మత్స్య, కోళ్ళ, గొఱ్ఱెల వ్యాపారస్తులు మెళకువ వహించండి. ఒక ప్రకటన మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
మకరం: ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన రోజు. రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికం అవుతున్నారని గమనించండి. వస్త్ర రంగాలలో వారికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. 
 
కుంభం: వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఇతరత్ర చికాకులు తప్పవు. స్థిరాచరాస్తుల క్రయవిక్రయాల్లో పునరాలోచన అవసరం. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు మందకొడిగా సాగుతాయి. 
 
మీనం: మీ చుట్టు ప్రక్కల వారితో సంభాషించేటప్పుడు మెళకువ వహించండి. లిటిగేషన్ వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. శనగలు, కంది, చింతపండు, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ప్రైవేటు రంగంలోని వారు మార్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ అశ్రద్ధ ఆలస్యాల వలన కొన్ని చికాకులు ఎదుర్కొనక తప్పదు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

04-07-2018 - బుధవారం మీ రాశి ఫలితాలు.. ఒంటరిగానే లక్ష్యాలను?

మేషం: పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రహస్య విరోధులు అధికం కావడం ...

news

నరదృష్టిని, వాస్తుదోషాలను పోగొట్టే తెల్లజిల్లేడు.. శ్వేతార్క గణపతిని పూజిస్తే? (video)

తెల్లజిల్లేడు చెట్టుల్లో తొమ్మిది రకాలున్నాయి. తెల్లజిల్లేడు చెట్టు 12 సంవత్సరాలు వర్షం ...

news

పితృదోషాలను ఎలా తొలగించుకోవాలో తెలుసా?

పూర్వీకులు, తాతముత్తాలను పితృదేవతలు అంటారు. వారికి జరగాల్సిన ప్రేత కార్యక్రమాలను సక్రమంగా ...

news

మంగళవారం (03-07-2018) రాశిఫలాలు - విందు వినోద కార్యక్రమాల్లో...

మేషం: కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. పూలు, పండ్లు, కొబ్బరి కాయల వ్యాపారులకు ...

Widgets Magazine