బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2019 (11:06 IST)

శుక్రవారం (07-06-2019) దినఫలాలు- సంఘంలో గౌరవ ప్రతిష్టలు...

మేషం: ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. ఏ అవకాసం కలిసిరాక నిరుద్యోగులు ఆందోళన చెందుతారు. సోదరీ, సోదరులతో మెళకువ వహించండి. వృత్తుల్లో వారికి సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. బ్యాంకు పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి అధికమవుతుంది.
 
వృషభం: ప్రభుత్వ కార్యాలయాల్లోని పనులు వాయిదా పడవచ్చు. రుణ, ఇతర వాయిదా చెల్లింపులు సకాలంలో జరుపుతారు. మెడికల్, ఇంజనీరింగ్, టెక్నికల్ విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు. దీర్ఘగాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. 
 
మిథునం: కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థల్లోని వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి అధికమవుతుంది. శ్రీమతి, శ్రీవారి మధ్య అనుమానాలు అపోహలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. 
 
కర్కాటకం: ఉన్నతస్థాయి అధికారులు అపరిచిత వ్యక్తులను దూరంగా వుంచడం మంచిది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభం. స్త్రీల యత్నాలకు అయిన వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వార్తా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
సింహం: దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో జయం చేకూరుతుంది. రాజకీయ నాయకులకు ప్రజాదరణ అధికంగా వుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలలో ఉల్లాసంగా గడుపుతారు. విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానిక్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. 
 
కన్య: స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. వస్త్ర, స్టేషనరీ, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. మీ అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం వుంది జాగ్రత్త వహించండి. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం నిరుత్సాహం కలిగిస్తుంది. మీ సంతానం పై చదువుల విషయమై బాగా శ్రమిస్తారు. 
 
తుల: విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. జాయింట్ వ్యాపారాలు, ఉమ్మడి వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూరప్రయాణాల్లో వస్తువుల పట్ల మెలకువ వహించండి. స్త్రీలు కొత్త వ్యక్తులతో తక్కువగా సంభాషించడం మంచిది. కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. 
 
వృశ్చికం : మీ బంధువులను సహాయం అర్థించే బదువు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఎల్ఐసి బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్ల ధనం అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. 
 
ధనస్సు: వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పనిభారం అధికం. పెద్దలు, అయిన వారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు సంపాదన, ఉద్యోగం పట్ల ఆసక్తి ఏర్పడుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
మకరం: స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ప్రధానం. ఒప్పందాలు చెల్లింపుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
కుంభం : వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు మినహా ఇబ్బందులుండవు. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. రాబోయే ఖర్చులకు తగినట్లు ఆదాయం పెంచుకుంటారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మీనం: ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమం కాదు. స్త్రీలకు ఆరోగ్య భంగం, వైద్య సేవలు తప్పకపోవచ్చు. పొదుపు పథకాలు, నూతన వ్యాపారాల దిశగా ఆలోచిస్తారు. ఆడిట్, అక్కౌంట్స్ రంగాలవారికి ఒత్తిడి, పనిభారం అధికంగా వుంటాయి. ఉమ్మడి వెంచర్లు, పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం.