09-09-2019- సోమవారం దినఫలాలు - సంబంధ బాంధవ్యాలు...

astro 10
రామన్| Last Updated: శుక్రవారం, 11 అక్టోబరు 2019 (16:01 IST)
మేషం: సినిమా కళాకారులకు అభిమాన బృందాలు అధికమవుతారు. సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా కలిసివస్తాయి. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఆశయసిద్ధికి అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనిలో దృఢ సంకల్ఫం ఉంటే విజయంతధ్యం. మీకు నచ్చని సంఘటనలు కొన్ని ఎదురుకావచ్చు.

వృషభం: ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఉమ్మడి స్థిరాస్తి విక్రయించే విషయంలో సోదరులతో విభేదిస్తారు. మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త యత్నాలు మొదలెడతారు. కొన్ని కారణాల రీత్యా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది.

మిధునం: నిరుద్యోగులకు స్థిరమైన అవకాశాలు లభిస్తాయి. రుణాలు తీస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం.

కర్కాటకం: భాగస్వామిక వ్యపారాల్లో కష్టనష్టాలు ఎదుర్కొవలసి వస్తుంది. బాధ్యతలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించండం మంచిది. గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. స్త్రీలు టి.వి, ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. రోజంతా ఆహ్లాదకరంగా గడిచిపోతుంది.

సింహం: ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలు మానసిక, శారీరిక ఒత్తిడులకు లోనువుతారు. మీ పిల్లల భవిష్యత్తు గురించి పథకాలు వేస్తారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిదికాదు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచితుల పట్ల మెళుకువ అవసరం.

కన్య: ఉపాధ్యాయులు ఒత్తిడి సమస్యలకు లోనవుతారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ధనం నిల్వ చేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. వాతావరణ ప్రతిబంధకాలు, శ్రమాధిక్యత తప్పవు.

తుల: ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఆశాజనంగా ఉంటుంది. స్త్రీలకు తమ మాటే నెగ్గలన్న పంతం అధికమవుతుంది. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. నూతన దంపతులు పరస్పరం మరింత చేరువవుతారు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చికం: స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. కోర్టు వ్యవహారాలు, ఆస్తి పంపకాలకు సంబంధించిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన విషయాల్లో మీ శ్రీమతి సలహా పాటించటం మంచిది. జాబ్‌వర్కు చేయువారికి ఆందోళనకు గురౌతారు.

ధనస్సు: వృత్తుల్లో తోటివారితో అభిప్రాయ భేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించండి. ఒకానొక సందర్భరంలో మిత్రుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుట వలన ఆందోళనకు గురౌతారు.

మకరం: విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. మీ వాగ్ధాటి, సమయస్ఫూర్తితో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తి పట్ల ఏకాగ్రత అవసరం. నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. నిత్యావసర వస్తువులు, బియ్యం, ఉల్లి వ్యాపారులకు వేధింపులు, చికాకులు అధికమవుతాయి.

కుంభం: స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస మళ్ళుతుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనలు, దూర ప్రయాణాలకు అనుకూలం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.

మీనం: హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి వేధింపులు అధికమవుతాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.దీనిపై మరింత చదవండి :