12-06-2019 బుధవారం మీ రాశి ఫలితాలు.. సత్యదేవుని పూజించినట్లైతే?

రామన్| Last Updated: బుధవారం, 12 జూన్ 2019 (10:21 IST)
సత్యదేవుని పూజించినట్లైతే అన్ని విధాలా శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: వృత్తి, వ్యాపారాల్లో అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల విషయాల్లో మీ వ్యూహం ఫలిస్తుంది. దూర ప్రయాణాలపై ఒక నిర్ణయానికి వస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. శ్రీమతి శ్రీవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. 
 
వృషభం: పెట్టుబడులు, పొదుపు పథకాలకు అనుకూలం. వస్తువు కొనుగోలులో నాణ్యత గమనించాలి. గత అనుభవాలతో లక్ష్యాన్ని సాధిస్తారు. వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. దూరంగా వున్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరుతారు. 
 
మిథునం: రాజకీయ, కళలు, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణాల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. రవాణా, ప్రకటనలు, బోధన, స్టేషనరీ, విద్యారంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 
 
కర్కాటకం: బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామ్యుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. దూర ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
సింహం: ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనా మనశ్శాంతి లోపిస్తుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ వహించండి. ఇంజనీరింగ్ రంగంలోని వారికి చికాకులు తప్పవు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. 
 
కన్య: సంఘంలో పలుకుబడి వున్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి పురోభివృద్ధి సాధిస్తారు. భార్యాభర్తల మధ్య అవగాహన లేక చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ప్రేమికుల మధ్య చికాకులు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్ ఉత్తర్వులు చేతికి అందుతాయి.
 
తుల: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. కష్టించి పనిచేసే వారికి ఫలితం దక్కుతుంది. రాజకీయ కళా రంగాల వారికి కొంత అనుకూలిస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు తప్పవు. ప్రత్తి, పొగాకు, స్టాకిస్టులకు ఒత్తిడి తప్పవు. నూతన ప్రదేశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృశ్చికం: రాజకీయాల్లోని వారు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. రుణాలు తీరుస్తారు. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదు. నరాలు, తల, ఎముకలకి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు.
 
ధనస్సు: మీ అభిప్రాయాలను, మనోభావాలను సున్నితంగా వ్యక్తం చేయండి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. ఎండుమిర్చి, నూనె, ఆవాలు, పసుపు, చింతపండు, బెల్లం, పానీయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు రాగలవు.
 
మకరం: బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారు అచ్చుతప్పులు పడుటవలన మాటపడవలసి వస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. ఆకస్మికంగా ఖర్చులు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కుంభం: సాహిత్య రంగంలోని వారికి సంతృప్తి కానవస్తుంది. ఫ్యాన్సీ, వస్తు, వస్త్ర వ్యాపారస్తులకు చికాకు తప్పదు. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. విద్యుత్, ఏసీ కూలర్, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. 
 
మీనం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. దీనిపై మరింత చదవండి :