బుధవారం (16-05-2018) దినఫలాలు... అక్కడ పునరాలోచన మంచిది...

మేషం: ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆపత్సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. నిరుద్యోగులకు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. సన్నిహితుల నుంచి అందిన ఒక సమాచారం మీలో కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. ప్

astrology
raman| Last Updated: బుధవారం, 16 మే 2018 (08:26 IST)
మేషం: ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆపత్సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. నిరుద్యోగులకు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. సన్నిహితుల నుంచి అందిన ఒక సమాచారం మీలో కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక అనుకూలించినా ఆశించిన ప్రయోజనకరంగా ఉండదు.

వృషభం: దైవ దర్శనాలు శుభకార్యల రీత్యా ధనం అధికంగా ఖర్చు చేస్తారు. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. పత్రికా సంస్థలోని వారికి చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. నూతన పెట్టుబడుల విషయంలో పురాలోచన అవసరం. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.

మిధునం: ఉద్యోగస్తులు స్థాన చలనానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పారిశ్రామిక రంగంలోని వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. ప్రేమికుల మధ్య ఎడబాట్లు తప్పవు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరువ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. విద్యార్ధులకు ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి.

కర్కాటకం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి మిశ్రమ ఫలితం. చిరకాల కోరిక నెరవేరే సమయం. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. గృహంలో మార్పులకై యత్నాలు అనుకూలిస్తాయి. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటగలవు. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది.

సింహం: ఆర్ధికలావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. చిట్స్, ఫైనాన్సు సంస్ధలల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి గురవుతారు. ప్రణాళికాబద్ధంగా శ్రమించి మీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.

కన్య: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాయిదా పడిన మెుక్కుబడులు తీర్చుకుంటారు. మీ సంతానం భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు.

తుల: వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. సర్దుబాటు ధోరణితో వ్యవహరించి కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడిత, చికాకులు అధికమవుతుంది.

వృశ్చికం: ఆర్థికలావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. అక్కౌంట్స్, మార్కెటింగ్, ఎల్ఐసి ఏజెంట్లు ఒత్తిడిత, ఆందోళనలకు గురువుతారు. ఒక కార్యం నిమిత్తం ప్రయాణం చేస్తారు. పత్రికా సంస్ధలలోని వారికి ఊహించని సమస్య లెదురవుతాయి. స్ధిరచరాస్తుల కొనుగోళ్ళ పట్ల ఆసక్తి పెరుగుతుంది.

ధనస్సు: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్ త్వరలోనే అందుతుంది. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. పెద్దమెుత్తం ధనం చెల్లింపులో ఆలోచన, తోటివారి సలహా తీసుకోవటం ఉత్తమం.

మకరం: దంపతుల మనస్పర్థలు తలెత్తుతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి.

కుంభం: ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. శ్రీవారు శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధచూపిస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వటం మంచిది కాదని గమనించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం.

మీనం: చేతి వృత్తులు, వైద్య రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, శ్రమాధిక్యత అధికమవుతాయి. కంది, నూనె, మిర్చి వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. కలప, ఇటుక, ఐరన్ వ్యాపారులకు అనుకూలం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.దీనిపై మరింత చదవండి :